Banglore: ఇన్‌స్టాగ్రామ్‌లో విద్యార్థిని న్యూడ్ AI ఫోటో

banglore based student's nude photo goes viral

Banglore:  తొమ్మిదో త‌ర‌గ‌తి చ‌దువుతున్న ఓ విద్యార్థిని న్యూడ్ ఏఐ ఫోటో ఇన్‌స్టాగ్రామ్‌లో వైర‌ల్ అవ‌డంతో ఆ పిల్ల త‌ల్లిదండ్రులు షాక‌య్యారు. వెంట‌నే త‌మ కూతురు చ‌దువుతున్న పాఠ‌శాల‌లో ఫిర్యాదు చేసారు. ఈ ఘ‌ట‌న బెంగ‌ళూరులో చోటుచేసుకుంది. త‌న కూతురి ఇన్‌స్టాగ్రామ్‌లోని ఓ ఫోటోను తీసుకుని ఏఐ ద్వారా న‌గ్నంగా మార్చి షేర్ చేస్తున్నారని.. ఇలా చేస్తున్నవారు త‌న కూతురికి తెలిసిన‌వారే అయ్యి ఉంటార‌ని పాఠ‌శాల‌లో ఫిర్యాదు చేయ‌డంతో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. వెంట‌నే పోలీసుల‌ను పిలిపించి విచార‌ణ చేప‌డుతున్నారు. వెంట‌నే త‌గిన చ‌ర్యలు తీసుకోక‌పోతే పాఠ‌శాల మూత‌బ‌డేలా చేస్తామ‌ని బాలిక త‌ల్లిదండ్రులు వార్నింగ్ ఇచ్చార‌ట‌.