Accident: 795 ప్రమాదాలతో టాప్‌లో బెంగళూరు
ఇండియాలో అత్యధికంగా రోడ్డు ప్రమాదాలు (accident) జరిగే ప్రాంతాల్లో కర్ణాటక రాజధాని బెంగళూరు (banglore) టాప్‌లో ఉంది. కేవలం ఆగస్ట్‌లోనే బెంగళూరులో 795 ఘోర రోడ్డు ప్రమాదాలు జరిగాయి. గత నెలలతో పోలిస్తే ఆగస్ట్ నెలలో రోడ్డు ప్రమాదాలు తగ్గాయంటే అక్కడ ఏ రేంజ్‌లో ప్రమాదాలు జరుగుతుంటాయో ఊహించవచ్చు.
మే నెలలో 1099, జూన్‌లో 965, జులైలో 807 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఈ మూడు నెలల్లో జరిగిన ప్రమాదాల్లో చనిపోయిన వారి సంఖ్య (accident)
మే- 1094
జూన్- 965
జులై- 807
ఆగస్ట్- 795
ఎక్కువగా బెంగళూరు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోనే ఈ ప్రమాదాలు జరుగుతున్నాయట. బెంగళూరు నగరంలో, బెంగళూరు గ్రామీణ, తుమకూరులో 2023 జులై వరకు 5830 మంది రోడ్డు ప్రమాదాల కారణంగా చనిపోయారు. మృతులు, బాధితుల్లో ఎక్కువ మంది బైకర్లే ఉంటున్నారట. వారిలో చాలా మంది హెల్మెట్లు పెట్టుకోకపోవడం వల్లే ప్రాణాలు కోల్పోయినవారు ఉన్నారు. (accident)