Bandla Ganesh డ్రైవర్ భార్య ఆత్మహత్య
Bandla Ganesh: ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ వద్ద డ్రైవర్‌గా పనిచేస్తున్న రమణ భార్య ఆత్మహత్యకు పాల్పడటం సంచలనంగా మారింది. రెండేళ్ల క్రితం రమణ బానోతు చందన అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరిద్దరూ బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ 2లోని ఓ అపార్ట్‌మెంట్‌లో ఉంటున్నారు. ఆదివారం రాత్రి రమణ భోజనం చేస్తున్న సమయంలో చట్నీ ఎక్కువ అయిందని చందనపై కాస్త కోపడ్డాడు. దాంతో ఆమె అలిగింది. మరుసటి రోజు ఉదయం రమణ విధులకు వెళ్లగా.. చందన పలుమార్లు వీడియో కాల్స్ చేసింది. అయినా రమణ ఎత్తలేదు. ఆ తర్వాత నార్మల్ ఫోన్ కాల్ చేసి తాను చనిపోతున్నానని చెప్పి పెట్టేసింది.
ఆ తర్వాత రమణ ఎన్నిసార్లు కాల్స్ చేసినా లిఫ్ట్ చేయలేదు. అనుమానం వచ్చి పక్కింట్లోని వ్యక్తికి రమణ కాల్ చేసి కాస్త తన భార్య ఇంట్లో ఉందో లేదో చూసి చెప్పమన్నాడు. ఎంత సేపు తలుపుకొట్టినా తీయకపోవడంతో తలుపులు బద్దలుకొట్టి లోపలికి వెళ్లి చూడగా చందన అన్నంత పని చేసింది. దాంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. కేవలం చట్నీ విషయంలో చందన ఇంత పని చేసి ఉండదని ఇంకేదో జరిగిందని పోలీసులు అనుమానిస్తున్నారు.