లోయలో మృతదేహాల సంచులు..!
Mexico: మెక్సికోలో (mexico) దారుణం చోటుచేసుకుంది. ఓ లోయలో మృతదేహాలున్న సంచులు లభ్యం కావడం సంచలనంగా మారింది. జెలిస్కో రాష్ట్రంలోని ఓ లోయలో దాదాపు 45 బ్యాగులు లభ్యం కావడంతో వాటిని బయటికి తీయించారు అధికారులు. తీరా చూస్తే అందులో డెడ్ బాడీలు, శరీర భాగాలు లభించాయి. వారం రోజుల క్రితం ఐదుగురు మగవారు, ఇద్దరు ఆడవాళ్లు కనిపించకుండాపోయారని పోలీసులకు ఫిర్యాదు అందింది. వారికోసం గాలింపులు చేపడుతుండగా.. ఓ లోయలో వారి బాడీలు సంచుల్లో పెట్టి ఉన్నాయి.
వీరంతా ఒక కాల్ సెంటర్‌లో పనిచేస్తున్నట్లు తెలిసింది. కాల్ సెంటర్లో డ్రగ్స్ తయారుచేస్తుంటారని బయటి ప్రపంచానికి తెలీకుండా ఇలా హత్యలకు పాల్పడుతున్నారని స్థానికులు తెలిపారు. అయితే చనిపోయిన వారికి డ్రగ్స్ తయారు చేసేవారికి సంబంధంలేదని, వారిని డ్రగ్స్ మాఫియాతో లింక్ చేయొద్దంటూ మృతుల కుటుంబీకులు వాపోతున్నారు. మెక్సికోలో డ్రగ్స్ మాఫియా ఎన్నో ఏళ్లుగా జరుగుతోంది. ఓ సర్వే ప్రకారం 2006 నుంచి ఇప్పటివరకు 340,000 మంది హత్యకు గురైనట్లు తేలింది.