Dhoni: ఇక ఆ అవకాశం లేదు..BCCI షాకింగ్ నిర్ణయం
Dhoni: లెజెండరీ క్రికెటర్ మహేంద్ సింగ్ ధోనీ ఫ్యాన్స్‌కి ఇది ఒక రకంగా బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. కంగారు పడకండి. ధోనీ మొత్తానికే క్రికెట్‌కి రిటైర్‌మెంట్ ఇవ్వలేదు. కాకపోతే.. భారత క్రికెటర్లకు, ఫ్యాన్స్‌కి ఎంతో ఇష్టమైన ధోనీ జెర్సీ 7 నెంబర్ చొక్కాను ఇక ఏ క్రికెటర్‌కు కేటాయించడానికి వీల్లేదని BCCI తేల్చి చెప్పింది.
2004 నుంచి క్రికెట్ రంగానికి ధోనీ అందించిన ఎనలేని సేవ, గుర్తింపులను గౌరవిస్తూ ఆయన వేసుకున్న జెర్సీ నెంబర్‌ను ఇంకొకరికి ఇవ్వకూడదని ఈ నిర్ణయం తీసుకున్నట్లు BCCI తెలిపింది. ప్రస్తుతానికి క్రికెట్ రంగంలోకి వస్తున్న కొత్త ప్లేయర్లకు కానీ ఆల్రెడీ ఆడుతున్నవారికి కానీ నెం 7, నెం 10 (సచిన్ తెందుల్కర్) జెర్సీలు అందుబాటులో ఉండవని వారికి ఇవి కేటాయించడం కుదరదని ప్రకటించింది. కొత్తగా వస్తున్న ఆటగాళ్లు తమ జెర్సీల సంఖ్యలను 1 నుంచి 100 లోపు ఎంచుకునే అవకాశం ఉంటుంది. కాకపోతే సంఖ్యను ఎంపికచేసుకునే పద్ధతిలో కూడా కొన్ని నిబంధనలు ఉంటాయి.
ఇప్పటికైతే 60 బేసి సంఖ్యల జెర్సీలను ప్రస్తుత ఆటగాళ్లకు కేటాయించింది BCCI . ఒకవేళ కొన్ని కారణాల వల్ల ఏ ఆటగాడైనా ఏడాది పాటు ఆటకు దూరంగా ఉన్నా కూడా వారి జెర్సీ సంఖ్యను మరొకరికి ఇవ్వరు. అలా చూసుకుంటే ఇప్పుడు కొత్తగా వస్తున్న ఆటగాళ్లకు 30 బేసి సంఖ్యలను ఎంచుకునే అవకాశం మాత్రమే ఉంది. 2017లో శార్దూల్ ఠాకూర్ సచిన్ తెందుల్కర్‌కి చెందిన 10వ నెంబర్ జర్సీ వేసుకుని ఆడటంతో సచిన్ ఫ్యాన్స్ రచ్చ రచ్చ చేసారు. దాంతో వెంటనే BCCI కలగజేసుకుని శార్దూల్‌కు 54 సంఖ్య ఉన్న జెర్సీ ఇచ్చింది.