Ayodhya Ram Temple: వర్షాలకు లీక్ అవుతున్న రామమందిరం
Ayodhya Ram Temple: ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్యలో నిర్మించిన రామమందిరం అప్పుడే వర్షాలకు లీక్ అయిపోతోంది. ఆలయంలోని ప్రధాన పై భాగం నుంచి నీళ్లు పడుతున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు ఆచార్య దాస్ మీడియా ద్వారా వెల్లడించారు. డ్రైనేజ్ సిస్టమ్‌ని ఏర్పాటుచేయకుండా హడావిడిగా ఆలయాన్ని నిర్మించేసారని ఆయన మండిపడ్డారు. శనివారం అర్థరాత్రి నుంచి నీళ్లు కారుతూనే ఉన్నాయని.. భక్తులు అసౌకర్యానికి గురవుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేసారు. అధికారులు వెంటనే చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
“” ప్రపంచంలోని టాప్ ఇంజినీర్లు అయోధ్య నిర్మాణాన్ని చేపట్టారు. ఈ ఏడాది జనవరిలో అయోధ్యను ప్రజల సందర్శనార్ధం తెరిచారు. కానీ వర్షాలకు పై భాగం కారుతోందా లేదా అనేది ఎవ్వరూ ఆలోచించలేదు. ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధమైన ఆలయ పైభాగం వర్షాలకు కారుతోందంటే ఆశ్చర్యకరమైన విషయం. ఇలా ఎందుకు జరిగింది? వరల్డ్ క్లాస్ ఇంజినీర్లు ఏమైపోయారు “” అని ఆచార్య దాస్ మండిపడ్డారు.