Ujjain Rape: నేను సాయం చేసాను స‌ర్.. న‌న్ను వ‌దిలేయండి ప్లీజ్

మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని ఉజ్జ‌యినిలో (ujjain rape) ఓ బాలిక అత్యాచార ఘ‌ట‌న దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నంగా మారిన సంగ‌తి తెలిసిందే. నిందితుడు అదుపులో ఉన్న‌ప్ప‌టికీ.. బాలిక సాయం కోసం ఇంటి ముందు వ‌స్తే స్పందించ‌ని వారిపై పోలీసులు కేసులు పెడుతున్నారు. ఈ నేప‌థ్యంలో ఓ ఆటో డ్రైవ‌ర్ సాయం చేయ‌నందుకు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అయితే అత‌ను బాలిక‌కు త‌న ష‌ర్ట్ ఇచ్చాన‌ని.. ఇంత‌కంటే ఏం చేయాలో త‌న‌కు తెలీలేద‌ని తెలిపాడు. త‌ను చేసిన ఒకే ఒక త‌ప్పు బాలిక‌ను హాస్పిటల్‌కు తీసుకెళ్ల‌క‌పోవ‌డ‌మేన‌ని.. ఈ మాత్రం దానికి త‌న‌ను ఇలా అరెస్ట్ చేయ‌డం స‌బబు కాద‌ని వేడుకుంటున్నాడు.

అత్యాచారానికి గురైన ఆ బాలిక ర‌క్తపుమ‌డుగుల్లో దాదాపు 500 ఇళ్ల‌కు, నాలుగు ధాబాల‌కు, ఒక టోల్ బూత్‌కు వెళ్లి సాయం అడిగింద‌ట‌. కానీ ఎవ్వ‌రూ క‌నికరించలేదు. చివ‌రికి ఓ పూజారి బాలిక‌ను చేర‌దీసి మంచి దుస్తులు వేసి పోలీసుల సాయంతో హాస్పిట‌ల్‌లో చేర్పించ‌డంతో విష‌యం వెలుగులోకి వ‌చ్చింది. ఎవ‌రైతే సాయం చేయ‌లేదో వారిని సీసీటీవీ ద్వారా గుర్తుప‌ట్టి అదుపులోకి తీసుకుంటున్నారు.