నిత్య పెళ్లికూతురికి HIV .. వరుడుల కోసం పోలీసుల గాలింపు
Viral News: డబ్బు కోసం నిత్య పెళ్లికూతురిలా మారి పెళ్లి చేసుకున్న ప్రతి మగాడితో కాపురం చేసిన మహిళకు HIV ఉందని తెలిసి పోలీసులు షాకయ్యారు. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకెళితే.. ముజఫర్‌నగర్ పోలీసులు నిత్య పెళ్లికూతురిలా మారి మగవారిని మోసం చేస్తున్న ఓ మహిళను అదుపులోకి తీసుకున్నారు. ఆమెను జైలుకు తరలించే క్రమంలో వైద్య పరీక్షలు చేయించగా HIV పాజిటివ్ అని తేలింది. దాంతో ఆమె ఎవరినైతే పెళ్లి చేసుకుందో వారి వివరాలు సేకరించి వారికి కూడా వైద్య పరీక్షలు చేయించాలని ఉత్తర్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్ ఆరోగ్య శాఖ అధికారులు ఆదేశాలు జారీ చేసారు.
ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ఓ ముఠా తమ వద్ద ఉన్న మహిళల చేత మోసపూరితమైన పెళ్లిళ్లు చేయించి డబ్బులు, నగలు దోచుకునేలా శిక్షణ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఓ మహిళ దాదాపు ఏడుగురిని వివాహం చేసుకుని వారితో సంసారం కూడా చేసినట్లు తెలిపింది. ఆమె వెల్లడించిన వివరాల ప్రకారం పోలీసులు విచారణ చేపట్టగా ముగ్గురికి వ్యాధి సోకినట్లు నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం వారు చికిత్స తీసుకుంటున్నారు. బాధితుల చికిత్సకు ప్రభుత్వమే ఆర్థిక సాయం చేస్తుందని అధికారులు తెలిపారు. మిగతా బాధితుల కోసం పోలీసులు వెతుకులాడలో పడ్డారు.