క్యాన్సర్‌తో చనిపోయిన భార్య.. ఐసీయూలోనే ఐపీఎస్ అధికారి ఆత్మహత్య
Assam: కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్న భార్య హాస్పిటల్లో చనిపోవడంతో.. అక్కడికక్కడే తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు ఓ ఐపీఎస్ అధికారి. ఈ ఘటన అస్సాంలో చోటుచేసుకుంది. గువహాటికి చెందిన సిలాదిత్య చేటియా అనే అధికారి అస్సాం ప్రభుత్వంలో హోం సెక్రటరీ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2009 బ్యాచ్‌కి చెందిన ఈ ఐపీఎస్ అధికారి ఈరోజు స్థానిక హాస్పిటల్‌లోని ఐసీయూలో తన సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని మృతిచెందాడు. కొంతకాలంగా ఇతని భార్య అదే హాస్పిటల్లో క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకుంటోంది. పరిస్థితి విషమించడంతో ఆమె ఈరోజు ఉదయం చనిపోయింది. భార్య మరణం తట్టుకోలేక సిలాదిత్య అక్కడికక్కడే ఆత్మహత్య చేసుకున్నారు.
తన భార్య చనిపోయిందని తెలిసి..అక్కడే ఉన్న నర్సులను బయటికి వెళ్లాలని..కాసేపు ప్రార్ధనలు చేసుకుంటానని సిలాదిత్య నర్సులతో చెప్పాడు. దాంతో వారు బయటికి వెళ్లారు. వారు వెళ్లగానే ఐసీయూ నుంచి తుపాకీ పేలిన చప్పుళ్లు రావడంతో మొత్తం హాస్పిటల్ ఉలిక్కిపడింది. తీరా వెళ్లి చూస్తే ఐసీయూలో సిలాదిత్య రక్తపు మడుగుల్లో కనిపించారు.