Obesity: ఒళ్లు త‌గ్గించండి.. లేదా రిటైర్మెంట్ తీస్కోండి

Assam: ఒళ్లు త‌గ్గించుకోండి(obesity) లేదా వీఆర్ఎస్ తీస్కోండి అని పోలీసుల‌కు అల్టిమేటం విధించారు అస్సాం డీజీపీ జీ.పీ సింగ్. అస్సాంలో(assam) ప‌నిచేస్తున్న పోలీసుల్లో 50% పైగా పోలీసుల‌కు విప‌రీతంగా ఒళ్లు వ‌చ్చేసింద‌ని, వాళ్లు డ్యూటీ చేయ‌డానికి ఫిట్‌గా లేరని ఆయ‌న ఆగ్ర‌హం వ్య‌క్తం చేసారు. ఈ నేప‌థ్యంలో బీఎంఐ 30కి మించి ఉన్న‌వారికి మూడు నెల‌లు టైం ఇచ్చి ఒళ్లు త‌గ్గించుకోవాల‌ని చెప్పారు. ఆగ‌స్ట్ 15 వ‌ర‌కు చూసి ఆ త‌ర్వాత BMI టెస్ట్ చేస్తారు. ఆ త‌ర్వాత కూడా ఒళ్లు త‌గ్గ‌క‌పోతే వారికి మరో మూడు నెల‌లు అవ‌కాశం ఇచ్చి.. వీఆర్ఎస్‌కి అప్లై చేసుకోమంటారు. అయితే హైపోథైరాయిడిజం ఉంటే మాత్రం వారికి ఎక్సెప్ష‌న్ ఉంటుంది. అస్సాంలో 70,000 మంది పోలీసులు ఉన్నారు. వారిలో స‌గానికి పైగా మ‌ద్యానికి అలవాటు ప‌డి విప‌రీతంగా లావైపోయారు. దాంతో అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తూ డ్యూటీలు స‌రిగ్గా చేయ‌లేక‌పోతున్నారు. వారి ఆరోగ్యం కోసం ఈ నిర్ణ‌యం తీసుకోక త‌ప్ప‌లేద‌ని జీపీ సింగ్ తెలిపారు. ఇందుకు అస్సాం సీఎం హిమంత విశ్వ‌శ‌ర్మ కూడా అనుమ‌తి ఇచ్చారు. వీఆర్ఎస్ తీసుకున్న‌వారికి నెల నెలా మొత్తం జీతం ప‌డుతుంది. వారి స్థానంలో యంగ్ ఆఫీసర్ల‌ను నియ‌మించాల‌ని అస్సాం ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది.