వేలంలో లడ్డూను దక్కించుకున్న ముస్లిం సోదరుడు

Asifabad: వినాయక చవితి పండగ మత సామరస్యానికి ప్రతీకగా నిలిచింది అని చెప్ప‌డానికి ఈ ఘ‌ట‌నే నిద‌ర్శ‌నం. వేలంలో లడ్డూను ఓ ముస్లిం సోదరుడు ద‌క్కించుకోవ‌డం విశేషంగా మారింది. కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా భట్‌పల్లిలో వినాయక వేలం పాటలో రూ.13,216లకు పాట పాడిన ముస్లిం సోద‌రుడు అఫ్జ‌న్ లడ్డూను సొంతం చేసుకున్నాడు.