Lions: మృగ‌రాజుల‌ను ఓడించే జంతువులు ఏవో తెలుసా?

అడ‌వికి రారాజు సింహం (lions). అస‌లు సింహాన్ని ఓడించే ద‌మ్ము, ధైర్యం మ‌రే జంతువుకి లేదు కాబ‌ట్టే దానిని కింగ్ ఆఫ్ జంగిల్ (king of jungle) అంటారు. అయితే సింహాల‌ను ఓడించే జంతువులు కూడా ఉన్నాయి. అవేంటో తెలుసా?

ఆఫ్రిక‌న్ ఏనుగు (african elephant)

ఆఫ్రిక‌న్ ఏనుగుల‌కు సింహాన్ని ఓడించే దమ్ము ఉంది. తొండం, దంతాల‌తో సింహాల‌ను ఇట్టే ఓడించేయ‌గ‌ల‌వు

ఖ‌డ్గ మృగం (rhinoceros)

మ‌నం యానిమ‌ల్ ప్లానెట్, నేష‌న‌ల్ జియోగ్రాఫిక్ ఛానెల్స్‌లో ఖ‌డ్గ మృగాల‌ను సింహాలు చంపి తిన‌డం చూస్తుంటాం. నిజానికి సింహాల‌ను ఓడించే స‌త్తా ఖ‌డ్గ మృగాల‌కు ఉంది. వాటి కొమ్ములు చూలు సింహాన్ని వంచ‌డానికి. కానీ అవి భ‌య‌ప‌డి ప‌రిగెత్త‌డం వ‌ల్ల సింహం వెంటాడి చంపుతుంది.

నీటి ఏనుగు (hippopotamus)

నీటి ఏనుగుల దంతాల బ‌లం సింహాల కంటే రెట్టింపు ఉంటుంది. వాటి దంతాల‌కు సింహాలు భ‌య‌ప‌డ‌తాయి. కాక‌పోతే నీటిలో ఉన్న‌ప్పుడు నీటి ఏనుగు సింహాల‌ను ఓడించ‌గ‌ల‌దు

మొస‌లి (crocodile)

సింహాలు మొస‌ళ్ల‌కు భ‌య‌ప‌డ‌తాయి. సింహం చెరువుల్లో నీళ్లు తాగుతున్న‌ప్పుడు మొస‌ళ్లు చ‌టుక్కున ఎటాక్ చేసి చంపుతాయి.

హైనా (hyena)

హైనాలు స‌హ‌జంగానే ఎప్పుడూ కోపంతో ఉంటాయి. ఇందుకు కార‌ణం వాటికి స‌రైన ఆహారం దొర‌క్క‌పోవ‌డం. ఆక‌లి మీదుంటే అవి సింహాల‌నైనా చంపి తిన‌గ‌ల‌వు.