AR Dairy: చేప నూనె మేం కలపలేదు.. అది ఇంకా ఖరీదు
AR Dairy: తిరుమల లడ్డూ తయారీ కోసం నెయ్యిని సరఫరా చేస్తున్న ఏఆర్ డైరీ ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఈ వివాదంపై స్పందించింది. తమిళనాడుకి చెందిన ఈ సంస్థ నుంచే శ్రీవారి లడ్డూకి వాడే నెయ్యి సరఫరా అవుతోంది. ఈ నెయ్యిలోనే చేప నూనె, జంతువుల కొవ్వు ఉందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏఆర్ డైరీ సంస్థ స్పందిస్తూ.. తాము అసలు ఎలాంటి చేప నూనె కానీ జంతువుల కొవ్వు కానీ వాడలేదని అన్నారు. ఎందుకంటే నెయ్యి కంటే చేపె నూనె మరింత ఖరీదైనదని దానిని మేమెందుకు వాడతామని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
“” చంద్రబాబు నాయుడు చేసే ఆరోపణల వల్ల మా వ్యాపారం దెబ్బతింటోంది. మేం చేప నూనె కలపడమేంటి? అసలు చేప నూనె ఎంత ఖరీదో తెలుసా? నెయ్యి కంటే చేప నూనె అత్యంత ఖరీదైనది. దానిని మేమెందుకు కొనుగోలు చేస్తాం మేమెందుకు కలుపుతాం. ఒకవేళ చేప మందు వాడినా వచ్చే వాసన భరించలేం. మరి లడ్డూ తయారు చేసేవారికి చేప వాసన వచ్చి ఉండాలి కదా. ఇప్పుడు మీరు రిపోర్టులు పెట్టి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు కాబట్టే ఇంత వివాదం జరుగుతోంది. 1998 నుంచి ఏఆర్ డైరీ నెయ్యి సప్లై చేస్తోంది. నెయ్యి తయారీకి ముందు పాలను 102 సార్లు క్వాలిటీ చెక్స్ చేస్తాం “” అంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు.