Apple: యాపిల్‌ స్టోర్‌ ప్రారంభించడానికి కారణం అదేనా?

Mumbai: భారత్‌(india)లో స్మార్ట్ ఫోన్ల వినియోగం గత కొన్నేళ్లుగా గణనీయంగా పెరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే వారు కూడా కొనుగోలు చేస్తున్నారు. దీనికి కారణం.. సోషల్‌ మీడియా విస్తరించడం.. వీడియోలు చూడటం పెరగడం… ఇంటర్‌నెట్‌ కనెక్ట్‌విటీ సదుపాయం కూడా అందుబాటులోకి రావడం. దీంతో భారత్‌ ప్రపంచంలోనే రెండో అతిపెద్ద స్మార్ట్‌ ఫోన్‌ మార్కెట్‌గా అవతరించింది. తొలి దేశం చైనా.. కాగా ఆ తర్వాత జాబితాలో ఇండియా చేరింది. సామ్‌సంగ్‌ బ్రాండ్‌తోపాటు, చైనీస్‌ కంపెనీలైన ఒప్పో, వివో, వన్‌ప్లస్‌ వంటి ఆండ్రాయిడ్‌లు.. ఇండియాలో డామినేట్‌ చేస్తున్నాయి. తాజాగా.. యాపిల్‌ ఉత్పత్తులను తయారీ సంస్థలను తొలిసారి భారత్‌లో ప్రారంభించారు. దీని వెనుక ఉన్న అసలు కారణం ఇప్పుడు తెలుసుకుందాం…

ఇటీవల కాలంలో భారత్‌ దేశంలో యాపిల్‌ ఫోన్ల విక్రయం గణనీయంగా పెరుగుతున్నాయి. 2022-23లో యాపిల్‌ సేల్స్‌ 6 బిలియన్స్‌ అంటే.. 600 వందల కోట్ల ఉత్పత్తులను భారతీయులు కొనుగోలు చేసినట్లు ఆ సంస్థ చెబుతోంది. ఇది గత ఏడాదితో పోలిస్తే… 45 శాతం గ్రోత్ ఉందని చెప్పవచ్చు. ఇక యాపిల్‌ ఫోన్లు అత్యధికంగా ఇప్పటి వరకు చైనాలోనే తయారవుతున్నాయి. అక్కడి నుంచి వివిధ దేశాలకు రవాణా అవుతున్నాయి. అయితే.. కొవిడ్‌ కారణంగా.. చైనాలో కేసుల సంఖ్య పెరగడం వల్ల యాపిల్‌ ఫోన్ల విక్రయాలు, రవాణా భారీగా తగ్గింది. దీని వల్ల చైనా నుంచి వివిధ దేశాలకు సంబంధాలు తెగిపోయాయి. ఈ సమస్యను గుర్తించిన యాపిల్‌ సంస్థ.. తమ వ్యాపార కార్యకలాపాలను విస్తరించాలని భావించి.. ఇండియాతోపాటు, వియత్నాంలో తయారీ కేంద్రాలను ఇటీవల ప్రారంభించింది.

భారత్‌లో మూడు కంపెనీలు యాప్‌ల్‌ ఉత్పత్తులు తయారు చేసేందుకు ముందుకు వచ్చాయి. అవి.. ఫాక్స్‌కాన్‌, పెగట్రాన్‌, విస్ట్రాన్‌ కంపెనీలు. భారత్‌లో కూడా యాపిల్‌ బ్రాండ్‌ పేరు విస్తరించడం.. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం స్కిల్‌ ఇండియా భాగంగా తయారీ సంస్థలకు పెద్దఎత్తున రాయితీలు కల్పించడం వల్ల యాపిల్‌ తయారీ సంస్థ భారత్‌లో అడుగుపెట్టిందని చెప్పవచ్చు.