Apple: ఐఫోన్ యూజర్లకు వార్నింగ్
ఐఫోన్లు (iphones) వాడే వినియోగదారులకు యాపిల్ (apple) కంపెనీ వార్నింగ్ ఇచ్చింది. చాలా మంది ఐఫోన్లు చార్జర్లు ఖరీదు ఎక్కువగా ఉన్నాయని వేరే కంపెనీకి చెందిన చీప్ చార్జర్లు కొనుగోలు చేస్తున్నారట. అలాంటి చార్జర్లతో ఐఫోన్లకి చార్జింగ్ పెడితే ఫోన్ డ్యామేజ్ అవ్వడమే కాదు పేలిపోయే ప్రమాదం ఉందట. అంతేకాదు.. ఐఫోన్‌ను బెడ్‌పైనే పెట్టి చార్జింగ్‌లో ఉంచి దాని పక్కనే పడుకోవడం లాంటివి కూడా చేయకూడదని వెల్లడించింది. ఫోన్ చార్జింగ్ పెట్టేటప్పుడు పరుపులు, దిండ్లపై ఉంచితే ఓవర్ హీట్ అయ్యి పేలిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ఎప్పుడూ వెంటిలేషన్ ఎక్కువగా ఉండే ప్రదేశాల్లోనే ఫోన్లను చార్జింగ్‌లో పెట్టాలట. (apple) చార్జింగ్ వైర్ కానీ అడాప్టర్ కానీ కొంచెం డ్యామేజ్ అయినా వెంటనే కొత్తది తీసుకోవడం మంచిదని తెలిపింది.