Kota: కొడుకుని చూసి వెళ్లగానే.. ఆత్మహత్య వార్త
Rajasthan: రాజస్థాన్‌లోని కోటాలో (kota) విద్యార్థుల మరణాలు సంచలనం సృష్టిస్తున్నాయి. ఇప్పటికే వరుసగా 19 మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. కోచింగ్ హబ్‌గా పేరొందిన కోటాలో చాలా మంది విద్యార్థులు IIT, JEE పరీక్షలకు ప్రిపేర్ అవుతుంటారు. ఈ నేపథ్యంలో కోచింగ్ కోసం వెళ్లిన 17 ఏళ్ల కుర్రాడు నిన్న రాత్రి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కన్న కొడుకు చూడటానికి వెళ్లిన ఓ తండ్రి తిరిగి ఇంటికి ప్రయాణం అవగానే కొడుకు లేడనే వార్త తెలిసి కుప్పకూలిపోయాడు. వివరాల్లోకెళితే.. ఉత్తర్‌ప్రదేశ్‌కు (uttar pradesh) చెందిన మనీష్ ప్రజాపతి అనే కుర్రాడు కోటాలో (kota) IIT కోచింగ్ తీసుకుంటున్నాడు.
కొంతకాలంగా మనీష్ సరిగ్గా చదవడంలేదని తెలిసి అతన్ని చూడటానికి వాళ్ల నాన్న ఉత్తర్‌ప్రదేశ్ నుంచి కోటాకు వెళ్లాడు. మనీష్ ఉంటున్న హాస్టల్‌కు వెళ్లి సాయంత్రం వరకు ఉండి తిరుగు ప్రయాణం అయ్యాడు. ఇంతలో ఏం జరిగిందో ఏమో.. ఇంటికి వెళ్తుండగానే మనీష్ ఆత్మహత్య చేసుకున్నాడని తెలిసింది. దాంతో వెంటనే మళ్లీ ఆయన కోటాకు ప్రయాణమయ్యాడు. మనీష్ సూసైడ్ చేసుకున్నట్లే తెలుస్తోంది కానీ ఎలాంటి సూసైడ్ లెటర్ లభించలేదని పోలీసులు తెలిపారు. కన్న కొడుకు బాగా చదివి తమను చూసుకుంటాడని ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆ తండ్రికి ఒక్క క్షణం కళ్ల ముందు ప్రపంచం ఆగిపోయినట్లు అనిపించింది. (kota)
అసలు కోటాలో ఏం జరుగుతోంది?
కోటాను కోచింగ్ హబ్ అని పిలుస్తారు. లక్షలాది మంది విద్యార్థులు ఐఐటీ, జేఈఈ కోచింగ్‌ల కోసం అని కోటాకు వెళ్తుంటారు. అక్కడ హాస్టల్స్‌లో నివసిస్తుంటారు. కానీ కొన్ని నెలలుగా కోటాలో ఏం జరుగుతోందో ఎవ్వరికీ పాలు పోవడంలేదు. ఇప్పటివరకు కోచింగ్ కోసం అని వెళ్లిన విద్యార్థుల్లో దాదాపు 19 మంది ఆత్మహత్య చేసుకున్నారు. దాంతో కోటా కాస్త కోచింగ్ హబ్ నుంచి సూసైడ్ హబ్‌గా తయారైంది. (kota)
సీట్ రాదేమోనని ఒత్తిడి
ఎందరో విద్యార్థులు సీటు వస్తుందో రాదో అన్న ఒత్తిడిలో ఇలా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ప్రధాని నరేంద్ర మోదీ ఈ విషయాన్ని పార్లమెంట్లో ప్రస్తావించారు. తల్లిదండ్రులు, కోచింగ్ సెంటర్లు పిల్లలపై ఎలాంటి ఒత్తిడి పెట్టవద్దని సూచించారు. విద్యార్థుల కోసం ప్రత్యేకించి కోటాలో ఆత్మహత్య నివారణ సెంటర్లను ఏర్పాటుచేయాలని ఆదేశాలు జారీ చేసారు, అయినా కూడా ఈ ఆత్మహత్య ఘటనలు ఆగడంలేదు. (kota)