Free Bus Scheme: స‌జ్జ‌నార్ కొత్త రూల్..!

Free Bus Scheme: తెలంగాణ‌లో కాంగ్రెస్ ప్ర‌భుత్వం ప్రారంభించిన ఉచిత బ‌స్సు ప‌థ‌కం విష‌యంలో TSRTC ఎండీ స‌జ్జ‌నార్ (sajjanar) మరో కొత్త రూల్ పెట్టారు. త‌క్కువ దూరం వెళ్లే మ‌హిళ‌లు ఎక్స్‌ప్రెస్ బ‌స్సుల్లో ఎక్కొద్ద‌ని స‌జ్జ‌నార్ విజ్ఞ‌ప్తి చేసారు. దీని వ‌ల్ల దూర ప్రాంతాల‌కు వెళ్లాల్సిన వారికి బ‌స్సుల్లో ప్ర‌యాణించే వీలు లేకుండాపోతోంద‌ని తెలిపారు. ఇక ఆధార్ కార్డులు లేదా ఇత‌ర ఐడీ ప్రూఫ్‌లు చూపించేట‌ప్పుడు ఒరిజిన‌ల్ డాక్యుమెంట్స్ చూపించాల్సిందేన‌ని ఫోనుల్లో ఫోటోలు చూపిస్తే ఉచిత ప్ర‌యాణం వ‌ర్తించ‌ద‌ని కూడా వెల్ల‌డించారు.