మహారాష్ట్రలోని మరో హాస్పిటల్లో ఒకే రోజు 8 మంది మృతి
మహారాష్ట్రలోని (maharashtra) నాందేడ్‌లోని ప్రభుత్వ హాస్పిటల్లో 24 గంటల్లో 31 మంది పేషెంట్లు మృత్యువాతపడిన ఘటన మరువకముందే ఇదే రాష్ట్రంలోని మరో హాస్పిటల్లో గడిచిన 24 గంటల్లో 8 మంది పేషెంట్లు చనిపోయారు. చనిపోయిన వారిలో నెలలు నిండకుండాన పుట్టిన పసికందులు కూడా ఉన్నారు. హాస్పిటల్లో సరైన వసతులు లేవని వైద్యులు సకాలంలో స్పందించకపోవడం వల్లే ఈ ఘోరం జరిగిందని మృతుల కుటుంబీకులు హాస్పిటల్ బయట ఆందోళన చేపడుతున్నారు. మహారాష్ట్ర మొత్తంలో 20 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉన్నాయి. ఈ కాలేజీల్లో సరైన వసతులు లేకపోవడం వల్ల ఇటీవల ప్రభుత్వం దాదాపు 350 మంది వైద్యుల్ని బదిలీ చేసింది.