Anju: పెళ్లి చేసేసుకుంది!

Pakistan: రీసెంట్‌గా ఫేస్‌బుక్‌లో పరిచ‌యం అయిన న‌స్రుల్లా (nasrulla) అనే పాకిస్థానీ (pakistan) వ్య‌క్తి కోసం ఇండియా నుంచి పాక్ వెళ్లిన మ‌హిళ అంజు (anju).. మ‌తం మార్చుకుని అత‌న్ని పెళ్లి చేసేసుకున్న‌ట్లు తెలుస్తోంది. రాజ‌స్థాన్‌కి (rajasthan) చెందిన అంజుకి ఆల్రెడీ పెళ్లి అయ్యింది. ఒక పాప కూడా ఉంది. అయిన‌ప్ప‌టికీ ఫేస్‌బుక్‌లో పాకిస్థానీ వ్య‌క్తితో ప‌రిచయం పెంచుకుంది. అత‌ను ఏం చెప్పాడో ఏమో కానీ జైపూర్ (jaipur) వెళ్తున్నాన‌ని చెప్పి అన్నీ స‌ర్దుకుని పాకిస్థాన్ వెళ్లిపోయింది (anju). అక్క‌డి పోలీసులు ఆమెపై అనుమానంతో డాక్యుమెంట్లు చెక్ చేయ‌గా అన్నీ ప‌క్కాగా ఉన్నాయ‌ని తెలీడంతో అనుమ‌తి ఇచ్చారు.

అలా వెళ్లిన అంజు..(anju) వెంట‌నే మ‌తం మార్చేసుకుని అత‌న్ని పెళ్లి చేసేసుకుంద‌ట‌. పెళ్లి చేసుకోవ‌డానికి ముందు త‌న పేరును ఫాతిమాగా మార్చుకున్న‌ట్లు పాక్‌కి చెందిన ఓ జ‌ర్న‌లిస్ట్ ట్విట‌ర్ ద్వారా వెల్ల‌డించారు. అయితే ఆమెను పెళ్లి చేసుకునే ఉద్దేశం త‌న‌కు లేద‌ని ఆ వ్య‌క్తి మీడియా వ‌ర్గాల ద్వారా తెలియ‌జేసాడు. మ‌రోప‌క్క అంజు మాన‌సిక ప‌రిస్థితి బాగోలేదని ఆమె తండ్రి తెలిపాడు. దాంతో అంజు ఇక వ‌స్తుందో రాదో అని ఆమె భర్త‌, బిడ్డ ఎదురుచూస్తున్నారు.