మియాపూర్లో కనిపించింది చిరుత కాదు అడవి పిల్లి
Miyapur: మియాపూర్ ప్రాంతంలో చిరుత కనిపించిందంటూ స్థానికులు బెంబేలెత్తిపోయి పోలీసులకు ఫిర్యాదు చేసారు. మెట్రో స్టేషన్ వెనుక వైపు చిరుత సంచరిస్తోందంటూ ఫోటోలు తీసి పోలీసులకు చూపించారు. వారు అటవీ శాఖ అధికారులతో మాట్లాడి పట్టిస్తామని ధైర్యం చెప్పారు. తీరా చూస్తే అది చిరుత కాదు. అడవి పిల్లి అని తేలింది.