Child Marriages: బాల్య వివాహాల కేసులు.. టాప్లో ఆంధ్రప్రదేశ్
Child Marriages: భారతదేశ వ్యాప్తంగా జరుగుతున్న బాల్య వివాహాల కేసుల్లో ఆంధ్రప్రదేశ్ టాప్ స్థానంలో నిలిచింది. ఈ విషయం ది లాన్సెట్ గ్లోబల్ హెల్త్ నివేదికలో తేలింది. ఆంధ్రప్రదేశ్లోని (andhra pradesh) ప్రతి నలుగురు మహిళల్లో ఒకరికి 18 ఏళ్లు నిండకుండానే వివాహితులు అయిపోతున్నారు. అలాగని తెలంగాణలో తక్కువేం కాదు. తెలంగాణలోనూ (telangana) ప్రతి ఐదుగురు అమ్మాయిలలో ఒకరు లేదా ఇద్దరు 18 ఏళ్లు నిండకుండానే వివాహ బంధంలోకి అడుగుపెట్టేస్తున్నారు.
2021 వరకు లెక్కలు ఇలా ఉన్నాయి
ఆంధ్రప్రదేశ్ – 29.6%
తెలంగాణ – 23.4%
కర్ణాటక – 20.5 %
తమిళనాడు – 12.7
కేరళ – 6.2 %