Same Sex Marriage: ఆ పెళ్లిళ్లు వద్దు.. తేల్చి చెప్పిన AP ప్రజలు
Hyderabad: కొన్ని రోజులుగా సేమ్ సెక్స్ మ్యారేజీలను(same sex marriage) లీగల్ చేయాలా వద్దా అనే అంశంపై సుప్రీంకోర్టులో(supreme court) వాదనలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆంధప్రదేశ్‌తో(andhra pradesh) సహా కొన్ని రాష్ట్రాల ప్రజలు ఈ పెళ్లిళ్లను లీగల్ చేయొద్దని తేల్చిచెప్పారు. ఇప్పటికే కేంద్రం ఈ పెళ్లిళ్లను లీగల్ చేయొద్దని సుప్రీంలో పిటిషన్ వేసింది. దీనిపై ఇతర రాష్ట్రాల ప్రజల అభిప్రాయాలను కూడా సేకరించాలని కోరింది. ఈ నేపథ్యంలో జరిపిన సర్వేలో ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, అస్సాం రాష్ట్ర ప్రజలు లీగల్ చేయడానికి ఒప్పుకోలేదు. మిగతా రాష్ట్ర ప్రజలు మాత్రం ఆలోచించుకోవడానికి సమయం కావాలని అడిగారట.
సుప్రీంకోర్టు అన్ని రాష్ట్రాల ప్రజల అభిప్రాయాలు తెలుసుకునేందుకు పలు జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. ప్రజల అభిప్రాయం సేకరించాక ఏడు రాష్ట్రాలు వెంటనే సర్వే చేసి సుప్రీంకు పంపించాయి. ఆ ఏడు రాష్ట్రాల్లో రాజస్థాన్, అస్సాం, ఆంధ్రప్రదేశ్ ఈ గే పెళ్లిళ్లను లీగల్ చేయొద్దని రిక్వెస్ట్ చేశాయి. ఆంధ్రప్రదేశ్‌లోని జిల్లాల అధికారులు మతపరమైన అంశాలను, పెద్దలను పరిగణనలోకి తీసుకుని తాము గే మ్యారేజీలకు, LGBTQకి వ్యతిరేకం అని తేల్చి చెప్పారు.