Anant Ambani: రూ.25 కోట్ల కాన్వాయ్‌తో దుబాయ్‌లో షాపింగ్!

Anant Ambani: ముఖేష్, నీతా అంబానీల కుమారుడు అనంత్ అంబానీ.. త్వ‌ర‌లో రాధికా మ‌ర్చెంట్‌ను వివాహం చేసుకోనున్న సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో వీరిద్ద‌రూ షాపింగ్ మొద‌లెట్టేసారు. ప్ర‌స్తుతానికి వీరిద్ద‌రూ దుబాయ్‌లో షాపింగ్ చేస్తున్నారు. అయితే దుబాయ్‌లో కేవ‌లం ల‌గేజ్ షాపింగ్ కోస‌మ‌ని.. అనంత్ రూ.10 కోట్ల విలువైన రోల్స్ రాయిస్ క‌లిన‌న్ కొన్నాడు.

అంతేకాదు.. దుబాయ్‌లో ఎక్క‌డికి షాపింగ్‌కి వెళ్లినా కూడా త‌న వెంట రూ.25 కోట్ల కాన్వాయ్‌ను ఏర్పాటుచేసుకున్నాడు. వీరి కాన్వాయ్‌లో క్యాడిల్యాక్ ఎస్క‌లేడ్స్, GMC యూకోన్ డెనాలిస్, చెవ్రాలె స‌బ‌ర్బ‌న్స్ ఉన్నాయి. భారీ ఎస్‌యూవీలతో పాటు ఆంబులెన్స్ కూడా ఉంది. మొన్న గుజ‌రాత్‌లోని జామ్ న‌గ‌ర్‌లో వీరిద్ద‌రియ కోసం ముఖేష్‌, నీతా అంబానీలు గ్రాండ్‌గా ప్రీ వెడ్డింగ్ వేడుక‌ను నిర్వ‌హించారు. ఈ వేడుక మొత్తానికి అయిన ఖ‌ర్చు రూ.1000 కోట్లు. అస‌లైన వివాహ వేడుక జూన్‌లో జ‌ర‌గ‌బోతోంది.