వృద్ధుడికి వింత సమస్య.. ఎముకలా మారిపోయిన జననాంగం
Viral News: ప్రమాదవశాత్తు కింద పడటంతో మోకాళ్ల నొప్పులు ఉన్నాయని హాస్పిటల్‌కు వెళ్లిన 60 ఏళ్ల వృద్ధుడికి షాకింగ్ విషయం తెలిసింది. తాను కింద పడ్డానని.. అప్పటి నుంచి మోకాలి నొప్పులు వేధిస్తున్నాయని వైద్యులకు తన బాధను చెప్పుకున్నాడు. దాంతో వైద్యులు అతనికి తుంటి ఎముక ఏమన్నా విరిగిందా అని తెలుసుకునేందుకు ఎక్స్‌రే తీసారు. ఆ ఎక్స్‌రేలో షాకింగ్ విషయం బయటపడింది. ఆ వృద్ధుడికి పీనైల్ ఆస్సిఫికేషన్ అయ్యిందట. అంటే.. జననాంగంలో కాల్షియం పేరుకుపోవడంతో అది కాస్తా ఎముకలా మారిపోయింది.
ఇలాంటి కేసులు ప్రపంచంలోనే చాలా అరుదు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు కేవలం 40 కేసులు మాత్రమే ఉన్నాయి. దాంతో ఆ వృద్ధుడికి మ్యాటర్ వివరించి చికిత్స చేయాలని వైద్యులు చెప్పారు. అయితే ఆ వృద్ధుడు మాత్రం తాను బాగానే ఉన్నానని.. తనకు మోకాళ్ల నొప్పి ఉందని చెప్తే వైద్యులు ఏదేదో ఉందని చెప్తున్నారంటూ నానా రచ్చ చేసాడు. తనకు ఎలాంటి చికిత్స అవసరం లేదంటూ హాస్పిటల్ నుంచి వెళ్లిపోయాడు. ఇలాంటి సమస్య ఉన్నవారికి మందులు రాసిస్తారు. ఒకవేళ ఎలాంటి నొప్పి లేకపోతే అబ్సర్వేషన్‌లో ఉంచాల్సి వస్తుంది.