Viral News: ఇంట‌ర్వ్యూలో బాస్‌ని లం** అని తిట్టి..

an entrepreneur shared shocking experience while interviewing a fresher

Viral News: త‌న కంపెనీలో ఉద్యోగానికి అప్లై చేసిన వ్య‌క్తితో ఇంట‌ర్వ్యూ చేస్తున్న బాస్‌కి షాక్ త‌గిలింది. ఇంట‌ర్వ్యూ చేస్తున్న సమ‌యంలో అడిగిన‌దానికి స‌మాధానం చెప్ప‌కుండా సాకులు చెప్పి చివ‌రికి బాస్‌ని ప‌ట్టుకుని లం** అని తిట్టి మ‌రీ ఇంట‌ర్వ్యూ నుంచి వెళ్లిపోయాడ‌ట. ఈ విష‌యాన్ని కంపెనీకి చెందిన బాసే స్వ‌యంగా లింక్డిన్‌లో వెల్ల‌డించ‌డంతో విష‌యం వెలుగులోకి వ‌చ్చింది.

సెనైన్ సావంత్ అనే యువిత గ్రైమ్ పేరుతో ఓ స్టార్ట‌ప్‌ను స్థాపించింది. త‌న కంపెనీకి ఓ సోష‌ల్ మీడియా ఎగ్జిక్యూటివ్ కావాలి. దాంతో త‌న‌కు వ‌స్తున్న రెస్యూమ్‌ల‌ను ప‌రిశీలిస్తూ వారిని సెనైనే స్వ‌యంగా ఇంట‌ర్వ్యూ చేస్తోంది. ఈ నేప‌థ్యంలో ఓ యువ‌కుడు ఇంట‌ర్వ్యూలో కాల్‌లో జాయిన్ అయ్యాడు. అత‌ను రీసెంట్‌గానే గ్రాడ్యుయేట్ అయిన‌ట్లు చెప్పాడు. అయితే ఇంట‌ర్వ్యూ సమ‌యంలో వీడియో ఆన్ చేయమంటే.. iOS అవ్వ‌క‌పోవ‌డం వ‌ల్ల వీడియో ప‌నిచేయ‌డం లేద‌ని సాకులు చెప్పాడు. దాంతో సెనైన్ వీడియో ఉన్న‌ప్పుడే ఇంట‌ర్వ్యూ తీసుకున్నాన‌ని చెప్పింది. దాంతో ఆ అభ్య‌ర్ధి సెనైన్‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసాడు. నువ్వు అంత పొగరుగా మాట్లాడ‌కు లం**. అయినా నీతో ఎవ్వ‌డూ మాట్లాడాల‌ని అనుకోడు అని వాగాడు. దాంతో సెనైన్ షాకైంది.

నువ్వేంటో నీ ప్రొఫెష‌న‌లిజం ఏంటో నాకు ఇప్పుడు బాగా అర్థ‌మైంది అని బుద్ధి చెప్పి కాల్ క‌ట్ చేసింది. దీనిని రికార్డ్ చేసి లింక్డిన్‌లో పోస్ట్ చేసింది. ఈ త‌రం ఫ్రెష‌ర్ల‌కు క‌నీసం ఇంట‌ర్వ్యూలో ఎలా మాట్లాడాలో కూడా తెలీడంలేద‌ని వారు జీవితంలో ఎలా బాగుప‌డ‌తార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేసింది.