వామ్మో.. స్కూల్‌ని అమ్మకానికి పెట్టేసిన స్టూడెంట్స్!
America: స్కూల్స్‌లో పిల్లలు చేసే ఆకతాయి పనుల గురించి ఎన్నో వింటుంటాం. కానీ ఈ స్కూల్ పిల్లలు చేసిన పని గురించి తెలిస్తే షాకవ్వాల్సిందే. ఇంతకీ అంతలా ఏం చేసారు అనుకుంటున్నారా? వారు చదువుతున్న స్కూల్‌నే అమ్మకానికి పెట్టేసారు. ఈ ఘటన అమెరికాలో (america) చోటుచేసుకుంది. మేరిల్యాండ్‌లోని మీడ్ హై స్కూల్‌కి చెందిన కొందరు స్టూడెంట్స్ కోపంలో జిల్లో అనే రియల్ ఎస్టేట్ వెబ్‌సైట్‌లో ఓ యాడ్ పోస్ట్ చేసారు. అందులో మీడ్ హై స్కూల్‌ని రూ.34 లక్షలకు అమ్మకానికి పెడుతున్నట్లు రాసారు. అంతేకాదు.. స్కూల్‌లోని 15 బాత్రూమ్స్‌లో డ్రైనేజ్ ప్రాబ్లం ఉందని, ఇక డైనింగ్ రూమ్స్ అన్నీ బాగానే ఉంటాయని పేర్కొన్నారు. పైగా ఈ స్కూల్ ఒక జైల్‌తో సమానమని కూడా రాసారు. అది చూసి నవ్వుకున్న ఆ వెబ్‌సైట్ సిబ్బంది ఆ యాడ్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దాంతో ఆ యాడ్ కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పిల్లల్లో ఇంత క్రియేటివిటీ ఉందా అంటూ ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు. 2020లో కోవిడ్ వచ్చినప్పుడు ఇక స్కూల్స్‌కి వెళ్లాల్సిన పనిలేదని ఓ స్కూల్‌ను ఇలాగే అమ్మకానికి పెట్టేసారట.