Ambani: అంబానీలు ఏ పాలు తాగుతారో తెలుసా?
Ambani: రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీల గురించి ఏ విషయమైనా అది వైరల్ అవుతూ ఉంటుంది. ప్రస్తుతం అంబానీ దంపతులు తమ చిన్న కుమారుడైన అనంత్.. రాధికా మర్చెంట్‌ల వివాహ పనుల్లో బిజీగా ఉన్నారు. అంబానీ కుటుంబంలో జరగబోయే చివరి పెళ్లి ఇదే కావడంతో అంగరంగ వైభవంగా వివాహాన్ని జరిపించనున్నారు.
అయితే అంబానీలు తాగే పాల గురించి ఓ టాపిక్ వైరల్‌గా మారింది. హోల్‌స్టైన్ ఫ్రీసియన్ అనే స్విట్జర్లాండ్‌కి చెందిన ఆవు పాలనే అంబానీ కుటుంబీకులు తాగుతారట. ఈ ఆవు పాలు ప్రత్యేకించి పుణె నుంచి వస్తాయి. ఈ ఆవు పాలు అమృతంలా ఉంటాయట. పుణెకి చెందిన భాగ్యలక్ష్మి అనే హైటెక్ డైరీ ఫాంలో ఈ ఆవుల క్షేత్రం ఉంది. దాదాపు 35 ఎకరాల్లో ఈ ఫాం ఉందంటే నమ్ముతారా? ఈ జాతికి చెందిన ఆవులు వీరి దగ్గర దాదాపు 3000 వరకు ఉన్నాయి.
ఈ ఆవుల ఖరీదు లక్షల్లో ఉంటుంది. ఈ ఆవులు నిద్రపోయేందుకు కేరళ నుంచి ప్రత్యేకించి పరుపులను తెప్పిస్తారు. సాధారణ నీరు, తౌడు కాకుండా RO ప్యూరిఫైడ్ నీటినే తాగిస్తారు. ఈ జాతికి చెందిన ఆవుల్లో ఒక్కో ఆవు రోజుకి 25 లీటర్ల పాలు ఇస్తుంది. అత్యధికంగా కాల్షియం, విటమిన్లు, ప్రొటీన్లు ఈ పాలల్లో అధికంగా ఉంటాయట. అందుకే అంబానీలు ప్రత్యేకించి ఈ స్విస్ బ్రీడ్ ఆవు పాలనే తెప్పించుకుని తాగుతారు.