Amazon: 20 ల‌క్ష‌ల జాబ్స్.. ఎందుకు మ‌ళ్లీ తీసేయ‌డానికా?

Hyderabad: ప్ర‌ముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ (amazon) 20 ల‌క్ష‌ల ఉద్యోగాలు క‌ల్పించ‌నుందట‌. ఈ విష‌యాన్ని అమెజాన్ CEO ఆండీ జస్సీ (andy jassy) వెల్లడించారు. 2025 నాటికి అమెజాన్ ఇండియాలో 15 బిలియ‌న్ డాల‌ర్లు ఇన్‌వెస్ట్ చేయ‌బోతోంద‌ట‌. ఇదే జ‌రిగితే ఇప్ప‌టివ‌ర‌కు అమెజాన్ ఇండియాలో 26 బిలియ‌న్ డాల‌ర్లు ఇన్‌వెస్ట్ చేసిన కంపెనీ అవుతుంది. ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ అమెరికా ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ఆండీ ఆయ‌న్ను క‌లిసారు. ఈ సంద‌ర్భంగా ఇండియాలో మ‌రింత ఇన్‌వెస్ట్ చేయ‌నున్న‌ట్లు తెలిపారు. ఇప్ప‌టివ‌ర‌కు అమెజాన్ ఇండియాలో 1.3 మిలియ‌న్ మందికి ఉద్యోగాలు క‌ల్పించింది. భార‌త్‌లో ప‌దేళ్లు పూర్తి చేసుకున్న సంద‌ర్భంగా 2025 నాటికి 20 ల‌క్ష‌ల ఉద్యోగ అవ‌కాశాలు క‌ల్పించ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించింది.

అయితే కోవిడ్ స‌మ‌యంలో బాగా న‌ష్టాలు చూసిన అమెజాన్ (amazon) 2022 న‌వంబ‌ర్ నుంచి మార్చి వ‌ర‌కు దాదాపు 15 వేల మందిని ఉద్యోగాల నుంచి తీసేసింది. కోవిడ్ స‌మ‌యంలో అవ‌స‌రం ఉన్నా లేక‌పోయినా ఇష్ట‌మొచ్చిన‌ట్లు హైరింగ్స్ చేసిన అమెజాన్ (amazon) ఆ త‌ర్వాత తాము చేసింది త‌ప్పు అని తెలుసుకుని అవ‌స‌రం లేనివారిని ఉద్యోగాల నుంచి తీసేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. మ‌ళ్లీ ఇప్పుడు 2025 నాటిక‌ల్లా 20 ల‌క్ష‌ల ఉద్యోగాలు ఇస్తామ‌ని ప్ర‌క‌టించింది. మ‌ళ్లీ ఉద్యోగంలోకి తీసుకుని వారిని అర్థాంత‌రంగా తీసేయడానికా అంటూ ప‌లువురు నెటిజ‌న్లు కామెంట్లు పెడుతున్నారు.