Amazon shopping: ఇక క‌ష్ట‌మే.. ధ‌ర‌లు పైపైకి..!

Hyderabad: ఆన్‌లైన్ షాపింగ్ దిగ్గజ సంస్థ అమెజాన్‌లో(amazon) ఇక షాపింగ్(shopping) చేయ‌డం క‌ష్ట‌మ‌నే చెప్పాలి. ఎందుకంటే మే 31 నుంచి ధర‌లు పెరిగిపోనున్నాయి. ఎగ్జైటింగ్ ఆఫ‌ర్లు ఉన్న‌ప్ప‌టికీ సేల్స్ రుసుం, క‌మిష‌న్ చార్జీలు పెర‌గ‌నున్నాయి. ఎల‌క్ట్రానిక్స్(electronics), కాస్మెటిక్స్‌(cosmetics), దుస్తులు(clothes), మెడిసిన్లు(medicines), ఇత‌ర స‌రుకుల‌పై ఈ చార్జీలు పెర‌గ‌నున్నాయి. ఈ బ‌ర్డెన్ క‌స్ట‌మ‌ర్ల‌పై ప‌డ‌నుంది. అంతేకాదు.. ఏదైనా ప్రొడ‌క్ట్‌ను రిట‌ర్న్ చేసేట‌ప్పుడు కొంత రుసుం కూడా చెల్లంచాల్సి ఉంటుంద‌ట‌. ఓవ‌ర్ ది కౌంటర్ మందుల్లో రూ.500 విలువైన కొనుగోలుపై సెల్ల‌ర్ రుసుం 5.5% నుంచి 12% ఉండ‌నుంది. రూ.500 కంటే ఎక్కువ ఉంటే సెల్ల‌ర్ రుసుం 15% ఉంటుంది. ఇవన్నీ కాస్ట్ క‌ట్టింగ్ కిందికి వ‌స్తాయ‌ని, ఈ నేప‌థ్యంలోనే ఇటీవ‌ల మ‌రో 500 మంది ఉద్యోగుల్ని అమెజాన్ తొలిగించింద‌ని కంపెనీ ప్ర‌తినిధి తెలిపారు. ఈ సెల్ల‌ర్ రుసుం మార్పుల‌న్నీ మే 31 నుంచి వ‌ర్తించ‌నున్నాయి. అంటే.. మే 31 నుంచి అమెజాన్‌లో షాపింగ్ చేయాలంటే ఒక‌టికి రెండుసార్లు ఆలోచించాల్సిందే..!