Jeff Bezos: కాబోయే భార్య కోసం రూ.500 కోట్ల ఇల్లు!
Hyderabad: అమెజాన్ (amazon) బాస్ జెఫ్ బేజోస్ (jeff bezos) తనకు కాబోయే భార్యకు చిరకాలం గుర్తుండిపోయే కానుక ఇచ్చారు. దాదాపు 500 కోట్లకు పైగా విలువైన భవనాన్ని గిఫ్ట్‌గా ఇచ్చారు. ప్రపంచంలోనే మూడో రిచెస్ట్ వ్యక్తి అయిన బేజోస్ త్వరలో తన గర్ల్‌ఫ్రెండ్ లౌరేన్ సాంచేజ్‌ను (lauren sanchez) వివాహం చేసుకోబోతున్నారు. 1993లో జెఫ్ మెకెన్జీ అనే యువతిని పెళ్లి చేసుకున్నారు. వీరికి నలుగురు పిల్లలు. 25 ఏళ్ల తర్వాత వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు.
భరణం కింద జెఫ్.. మెకెన్జీకి 38 బిలియన్ డాలర్లు ఇచ్చారు. అంతేకాదు.. ఆమెకు అమెజాన్‌లో 25% స్టాక్స్ వాటాగా ఇచ్చారు. ఇక మాజీ బ్రాడ్‌కాస్ట్ జర్నలిస్ట్ అయిన లారేన్ సాన్షేకి బెజోస్‌తో ఇది మూడో పెళ్లి. ఇదివరకే ఆమెకు రెండు పెళ్లిళ్లు అయ్యి ఇద్దరు పిల్లలు ఉన్నారు. గర్ల్‌ఫ్రెండ్‌కి గిఫ్ట్ ఇచ్చిన ఇల్లు ఇండియన్ క్రీక్ ఐలాండ్‌లో ఉంది. మొత్తం మూడు బెడ్‌రూంలు, మూడు బాత్రూమ్‌లు ఉన్నాయట. ఇటీవల బేజోస్ తన 500 మిలియన్ డాలర్ల షిప్‌లో లౌరేన్‌కు 20 కోట్ల విలువైన ఉంగరం తొడిగి మరీ నిశ్చితార్ధం కూడా చేసుకున్నారు. (jeff bezos)