Jeff Bezos: ఘనంగా అమెజాన్ బాస్ నిశ్చితార్థం!
America: అమెజాన్(amazon) యజమాని జెఫ్ బేజోస్(jeff bezos) నిశ్చితార్థం ఘనంగా జరిగింది. కొంతకాలంగా జర్నలిస్ట్ అయిన లోరేన్ సాన్షేతో(lauren sanchez) ప్రేమలో ఉన్న బేజోస్ ఫ్రాన్స్‌లో ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారు. బేజోస్ తన 500 మిలియన్ డాలర్ల విలువైన షిప్‌లో లారేన్‌కు ప్రొపోజ్ చేసారట. ప్రస్తుతం వీరిద్దరూ కేన్స్ ఫిలిం ఫెస్టివల్‌లో జరగనున్న సెలబ్రిటీ పార్టీకి హాజరుకానున్నారు. 1993లో జెఫ్ మెకెన్జీ అనే యువతిని పెళ్లి చేసుకున్నారు. వీరికి నలుగురు పిల్లలు. 25 ఏళ్ల తర్వాత వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. భరణం కింద జెఫ్.. మెకెన్జీకి 38 బిలియన్ డాలర్లు ఇచ్చారు. అంతేకాదు.. ఆమెకు అమెజాన్‌లో 25% స్టాక్స్ వాటాగా ఇచ్చారు. ఇక మాజీ బ్రాడ్‌కాస్ట్ జర్నలిస్ట్ అయిన లారేన్ సాన్షేకి బెజోస్‌తో ఇది మూడో పెళ్లి. ఇదివరకే ఆమెకు రెండు పెళ్లిళ్లు అయ్యి ఇద్దరు పిల్లలు ఉన్నారు.