ప్రపంచంలోనే కుబేరులు.. 700 కార్లు, 4000 కోట్ల బంగ్లా..!
Viral News: పై ఫోటోలో కనిపిస్తున్న దుబాయ్ షేక్ కుటుంబాన్ని చూసారా? చూటడానికి ఎంత సింపుల్‌గా ఉన్నారో కదా..! కానీ వారి దగ్గర ప్రపంచానికే అప్పు ఇచ్చేంత ఆస్తి ఉంది. వీరిది అబు దాబికి చెందిన రాజకుటుంబం. వీరిని అల్ నాహ్యాన్ కుటుంబం అని పిలుస్తారు. సాధారణంగా దుబాయ్ షేక్‌ల వద్ద ఉండే ఆస్తి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
అలాంటి రాజకుటుంబానికి చెందిన ఆస్తి అంటే ఇక ఏ రేంజ్లో ఉంటుందో మీ ఊహకే వదిలేస్తున్నాం. వీరు ఉండే ప్యాలెస్ ఖరీదు రూ.4000 కోట్లు. పై ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు షేక్ మహమ్మద్ బిన్ జాయేద్ అల్ నాహ్యాన్. ఇతను యూఏఈ అధ్యక్షుడు. ఇతని వద్ద 700 రకాల దాదాపు ప్రపంచంలోని అన్ని బ్రాండ్ల కార్లు ఉన్నాయి.
వీరు నివసించే ప్యాలెస్ 94 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ప్రపంచంలోని చమురు నిల్వల్లో 6 శాతం వ్యాపారాలు వీరివే. మాంచెస్టర్ సిటీ ఫుట్‌బాల్ క్లబ్ కూడా వీరిదే. ఇవే కాదు రిహానాకు చెందిన ప్రముఖ బ్రాండ్ ఫెంటీలో, ఎలాన్ మస్క్‌కి చెందిన స్పేస్ ఎక్స్‌లో కూడా వాటాలు ఉన్నాయి. గత ఐదేళ్లలో వీరి ఆస్తుల విలువ 25000 శాతానికి పెరిగింది. 2015లో న్యూయార్క్ బయటపెట్టిన నివేదిక ప్రకారం బ్రిటన్ రాజకుటుంబానికి ఎంత ఆస్తి ఉందో అంతే ఆస్తి ఈ అల్ నాహ్యన్ కుటుంబానికీ ఉందని తేలింది.