Teachers Day: ప్రపంచంలోనే తొలి టీచర్ ఎవరో తెలుసా?
Teachers Day: ఈరోజు ఉపాధ్యాయుల దినోత్సవం. మన తెలుగువారికి ఉపాధ్యాయుల దినోత్సవం అనగానే మన దేశ తొలి ఉప రాష్ట్రపతి, రెండో రాష్ట్రపతి అయిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ మాత్రమే గుర్తుకొస్తారు. ఆ మహనీయుడిని ఈరోజున తప్పకుండా ప్రతి ఒక్క విద్యార్థి గుర్తుచేసుకోవాలి. అందులో ఎలాంటి సందేహం లేదు. అయితే.. ఈ ప్రపంచంలోనే తొలి టీచర్ ఒకరు ఉన్నారు. ఆ వ్యక్తి గురించి ఈరోజు మనం తెలుసుకుందాం.
ఇంతకీ ఈ ప్రపంచంలోనే తొలి ఉపాధ్యాయుడు ఎవరంటే కాన్‌ఫ్యూచియస్. ఇతను చైనాకి చెందిన తత్వవేత్త. ఈయన 551 BCలో జన్మించాడు. ప్రైవేట్ ట్యూటర్‌గా పనిచేసిన కాన్‌ఫ్యూచియస్.. తర్వాత ప్రపంచంలోనే తొలి ఉపాధ్యాయుడిగా పనిచేసారు. కాన్‌ఫ్యూచియస్ చైనాలోని ఓ మధ్య తరగతి కుటుంబంలో పుట్టి హిస్టరీ, మ్యాథ్స్, మ్యూజిక్ తనంతట తానే నేర్చుకున్నాడు.
కాన్‌ఫ్యూచియస్ పుట్టిన రోజుల్లో విద్య అనేది కేవలం రాజుల పిల్లలకు మాత్రమే ఉండేది. ఆ రోజుల్లో ఇంకెవ్వరూ చదువుకోవడానికి వీలు ఉండేది కాదు. ఒకవేళ రహస్యంగా చదువుకోవాలనుకున్నా వారిని ఉరితీసేవారు. ఇప్పటికీ కాన్‌ఫ్యూచియస్‌నే స్ఫూర్తిగా తీసుకుని పిల్లలకు ఉచితంగా చదువు చెప్పాలనుకునేవారు ఈ ప్రపంచంలో ఎందరో ఉన్నారట. అయితే.. గ్రీస్‌కి చెందిన మరో ఫేమస్ తత్వవేత్త.. 384 BCలో పుట్టిన అరిస్టాటిల్‌ని కూడా తొలి ఉపాధ్యాయుడిగా చెప్తుంటారు.