Beer: మూత్రంతో తయారుచేసే ఈ బీర్ గురించి తెలుసా?
Beer: బీర్‌ని ఇష్టంగా తాగేవారు చాలా మంది ఉంటారు. మితంగా తాగితే ఆరోగ్యానికి మంచిది అని వైద్యులు కూడా చెప్తుంటారు. అయితే ఈ బీర్ గురించి తెలిసాక మీకు దానిని తాగాలన్న మూడ్, ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయ్. ఎందుకంటే ఈ బీర్‌ని మనుషుల మూత్రంతో తయారుచేస్తారట.
2017లో ఓ బీర్ తయారీ కంపెనీకి ఈ దిక్కుమాలిన ఆలోచన వచ్చిందట. నార్తన్ యూరప్‌లో జరిగే ఓ ఫెస్టివల్ సమయంలో మూత్రంతో తయారుచేసిన బీర్‌ను సర్వ్ చేయాలని ఆ కంపెనీ ప్లాన్ వేసింది. ఇందుకోసం దాదాపు 50 వేల మంది నుంచి మూత్రాన్ని సేకరించారు. బీర్ తయారీకి ఎక్కువగా నీరు అవసరం అవుతుంది కాబట్టి నీటిని ఆదా చేసేందుకు ఇలా మూత్రం వాడినట్లు ఆ కంపెనీ చెప్తోంది. సింగపూర్ వంటి దేశాల్లో నీటి కొరత మరీ ఎక్కువ. మూత్రాన్ని రీసైకిల్ చేసి న్యూ బ్రూ అనే పేరుతో అమ్మేస్తున్నారు. సింగపూర్‌లోనే కాకుండా ఇతర దేశాల్లోనూ దీనిని అమ్ముతున్నారు.
విచిత్రం ఏంటంటే.. ఈ మూత్రం బీర్‌ను తయారుచేసేందుకు కంపెనీకి ప్రభుత్వం నుంచి కూడా అనుమతి లభించింది. మూత్రంతో తయారుచేసినప్పటికీ ఈ న్యూ బ్రూ బీర్ తాగేవారికి సాధారణ బీర్ తాగుతున్న ఫీలింగే కలుగుతోంది అని చెప్పడం కొసమెరుపు. కాబట్టి.. మీరు బీర్ ప్రియులైతే న్యూ బ్రూ పేరుతో కనిపించే బీర్లకు మాత్రం దూరంగా ఉండండి.