Work From Home: పెన్సిల్ ప్యాకింగ్ చేస్తే నెల‌కు 20,000

all you need to know about this pencil packing work from home

Work From Home: ఈ మధ్య‌కాలంలో చాలా ర‌కాల వ‌ర్క్ ఫ్రం హోం జాబ్స్ వ‌స్తున్నాయి. సాధార‌ణ ఉద్యోగాల కంటే ఇలాంటి ఉద్యోగాలు ఒక రెండు మూడు చేసుకుంటే నెల‌కు రూ.50,000 వ‌ర‌కు సంపాదించుకోవ‌చ్చు.  ఆఫీస్‌కి వెళ్లి వ‌ర్క్ చేసే అవ‌కాశం లేని వారికి ఇలాంటి వ‌ర్క్ ఫ్రం హోం జాబ్స్ వ‌రం లాంటివ‌నే చెప్పాలి. అలాంటి వ‌ర్క్ ఫ్రం హోం జాబ్సే ప‌లు పెన్సిల్ త‌యారీ కంపెనీలు ఇస్తున్నాయ‌ట‌. వారు త‌యారు చేసిన పెన్సిళ్ల‌ను నీట్‌గా ప్యాకింగ్ చేసి పంపిస్తే నెల‌కు రూ.20,000 వ‌ర‌కు అర్జించ‌వ‌చ్చు. ఇలాంటి కంపెనీలు పెన్సిల్స్, బాక్సులు, బ్రాండ్ స్టిక్క‌ర్లు, ప్యాకింగ్ టేప్, అవ‌స‌ర‌మైతే ప్యాకింగ్ మెషీన్‌ని ఇస్తాయి. వీటి సాయంతో పెన్సిల్ ప్యాకింగ్ చేసి మ‌ళ్లీ కంపెనీల‌కు పంపిస్తే వారు ఇంత మొత్తం అని ఇస్తారు.