INS Kattabomman: వికారాబాద్‌లో కొత్త రాడార్ స్టేషన్
INS Kattabomman: INS కట్టబొమ్మన్.. భారతదేశానికి చెందిన జలాంతర్గాములకు ఓ కమ్యునికేషన్ హబ్ లాంటిది. దాదాపు 34 ఏళ్లుగా సక్సెస్‌గా పనిచేస్తున్న ఈ హబ్ ఇప్పుడు తెలంగాణలోని వికారాబాద్‌లో ఓ రేడార్ స్టేషన్‌ను ఏర్పాటుచేయబోతోంది. పర్యవరణ సంరక్షణను కూడా దృష్టిలో పెట్టుకుని ఈ హబ్ ఇప్పటివరకు ఎలాంటి ఫిర్యాదులు లేకుండా 34 ఏళ్లుగా పనిచేస్తోందన్న రికార్డ్ ఉంది. ఇన్నేళ్లలో ఈ హబ్ కారణంగా పరిసర ప్రాంతాల్లోని చెట్లకు కానీ నివాసితులకు కానీ ఎలాంటి ఇబ్బందులు కలగలేదు. ఈ హబ్‌లో పనిచేస్తున్న వారికి కూడా ఇప్పటివరకు ఎలాంటి అనారోగ్య సమస్యలు రాలేదట.
INS కట్టబొమ్మన్ హబ్ తమిళనాడులో ఉంది. ఈ హబ్ రావడం వల్ల పరిసర ప్రాంతాల్లో వన్య ప్రాణుల సంరక్షణ, చెట్లు విపరీతంగా అభివృద్ధి చెందాయి. దీనిని బట్టి చూస్తేనే అర్థమవుతోంది మిలిటరీ ప్రాజెక్ట్‌ల వల్ల ప్రకృతికి ఎలాంటి నష్టం వాటిల్లదు అని. ఇప్పుడు వికారాబాద్‌లో ఏర్పాటుకానున్న రాడార్ స్టేషన్ అటవీ ప్రాంతంలో సగానికి పైగా భూమిని పరిరక్షించడమే లక్ష్యంగా పెట్టుకొని, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి పర్యావరణంపై ప్రభావాన్ని తగ్గించే ప్రయత్నంలో ఉంది. ఇవన్నీ భారతీయ సముద్ర భద్రతను కాపాడడంలో కూడా సహాయపడతాయి. INS కట్టబొమ్మన్ విజయవంతమైన ఉదాహరణను అనుసరిస్తూ, వికారాబాద్ స్టేషన్ వ్యూహాత్మక, పర్యావరణ లక్ష్యాలను సాధించడానికి కృషి చేస్తోంది.