Redmi K70 Ultra: ట్రిపుల్ కెమెరాతో రెడ్‌మీ నుంచి అదిరిపోయే ఫోన్.. ఫీచర్లివే
Redmi K70 Ultra: రెడ్‌మి నుంచి మరో ఆసక్తికరమైన ఫోన్ లాంచ్ అవ్వనుంది. ఈ నెల 18న రెడ్‌మి K70 అల్ట్రా చైనాలో లాంచ్ కానుంది. కర్వ్ ఎడ్జ్‌తో ఫోన్ మాత్రం చూసేందుకు చాలా స్టైలిష్‌గా ఉంది. దీంట్లో ట్రిపుల్ రేర్ కెమెరా ఆప్షన్ ఉంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్‌తో (OIS) పాటు50 మెగాపిక్సెల్ మెయిల్ సెన్సార్‌ను అమర్చారు. ఈ ఫోన్‌కి సైడ్‌లో ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ఇచ్చారు. మంచి డిస్‌ప్లే అనుభూతిని కలిగించేందుకు సన్నని బెజెల్స్ ఉపయోగించారు.
1.5K ఫ్లాట్ OLED డిస్‌ప్లేతో ఈ ఫోన్ రాబోతోంది.
ఇది ఆండ్రాయిడ్ 14తో పనిచేస్తుంది
వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ కూడా
ఈ రెడ్‌మి K70 అల్ట్రా ఫోన్‌తో పాటు మిక్స్ ఫ్లిప్ మిక్స్ ఫోల్డ్ 4 మోడల్స్‌ని కూడా లాంచ్ చేయాలని రెడ్‌మి భావిస్తోంది. ఇందుకోసం పేరెంట్ కంపెనీ అయిన షావోమీ సంస్థ అంతర్జాతీయ మార్కెట్‌లోకి అడుగుపెట్టనుంది. ఈ ఫోల్డబుల్ ఫోన్లు ఇప్పటికైతే కేవలం చైనాలోనే అందుబాటులో ఉండేవి. ఇప్పుడు ఇతర దేశాల్లోనూ అందుబాటులోకి తేనున్నారు.