Viral News: నిద్రలో రేప్, సెక్స్ నేరం కావా?
Viral News: నిద్రపోతున్నప్పుడు ఎవరైనా అత్యాచారానికి గురైతే అది నేరం కాదట. దీనిని తీర్పుగా వెల్లడిస్తూ ఓ బాధితురాలి కేసును ఓ న్యాయస్థానం కొట్టేసింది. దాంతో ఆమె మళ్లీ అప్పీల్ పెట్టుకోగా.. చచ్చినట్లు కోర్టు పెద్ద మొత్తంలో మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది.
అసలేం జరిగిందంటే.. బ్రిటన్‌కి చెందిన జేడ్ బ్లూ అనే 32 ఏళ్ల మహిళపై 2003లో అత్యాచారం జరిగింది. ఆమె తెలిసినవాళ్లింట్లో జరుగుతున్న పార్టీకి వెళ్లగా పీకల దాకా తాగేసి నిద్రపోయింది. ఉదయం లేచి చూడగానే.. తన దుస్తులు కనిపించలేదు. పక్కనే ఓ యువకుడు నిద్రపోయి కనిపించాడు. దాంతో తన పట్ల దారుణం జరిగిందని బ్లూకి తెలిసింది. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ఆమెను నిందితుడిని కోర్టులో ప్రవేశపెట్టారు.
అయితే.. జేడ్కి సెక్సోమ్నియా ఉందని నిందితుడి తరఫు న్యాయవాదులు వాదించడంతో కేసు కొట్టేసారు. ఇన్సోమ్నియా అంటే నిద్రలేమితనం. సెక్సోమ్నియా అంటే నిద్రలో సెక్స్, హస్తప్రయోగం వంటివి చేయడం. అయితే.. ఈ సెక్సోమ్నియా వ్యాధి ఉన్నవారికి ఉదయం లేచాక ఏం జరిగిందో గుర్తు ఉండదు. జేడ్ బ్లూ విషయంలోనూ ఇదే జరిగిందని.. అలాంటప్పుడు తన క్లైంట్‌ని నిందితుడు అని ఆరోపణలు చేయడం సబబు కాదంటూ వాదించడంతో కేసు కొట్టేసారు.
తనకు జరిగిన అన్యాయాన్ని ఎలాగైనా ఎదుర్కోవాలని జేడ్ బ్లూ 2020లో సరైన సాక్షాధారాలు పట్టుకొచ్చి మళ్లీ కోర్టులో అప్పీల్ చేసింది. అలా జేడ్ పట్ల జరిగిన అన్యాయానికి చింతిస్తూ కోర్టు 50 లక్షల పరిహారాన్ని ప్రకటించింది. అయితే అప్పటికే నిందితుడి ఆచూకీ తెలీకపోవడంతో అతను తప్పించేసుకున్నాడు.