Manzuri: ఆడవాళ్ల లైంగిక కోరిక తీర్చడమే నా వ్యాపారం
Manzuri: మీరు చదివింది కరెక్టే.. ఆడవాళ్ల కోసం సెక్స్ టాయ్స్ అమ్ముతూ వారి కోరికలు తీరుస్తుంటాను అని అంటున్నాడు రితేష్. ఇతను ఓ స్టార్టప్ సంస్థను స్థాపించాడు. ఆ సంస్థ పేరు మంజూరీ. మంజూరీ అనేది హిందీ పదం. అంటే అనుమతి అని అర్థం. అదంతా సరే కానీ.. ఈ ఆడవాళ్ల లైంగిక కోరికలు తీర్చేందుకు వ్యాపారం పెట్టడం ఏంటి చండాలంగా అనుకుంటున్నారా? అయితే రితేష్ కథేంటో తెలుసుకోవాల్సిందే.
మన దేశంలో ఇప్పటికీ సెక్స్ అనే టాపిక్ గురించి ఓపెన్‌గా ఎవ్వరితోనూ చర్చించలేం. సెక్స్ డాక్టర్ల వద్దకు వెళ్లినా మొహమాటంతో సమస్య ఏంటో చెప్పకుండా వెనక్కి వచ్చేసే పేషంట్లు ఎంతో మంది ఉన్నారు. జీవనశైలి మారుతోంది.. రోజులు మారుతున్నాయ్.. అలాంటప్పుడు సెక్స్ టాపిక్ గురించి ఓపెన్‌గా డిస్కస్ చేసుకునే రోజులు కూడా రావాలి అని అంటున్నాడు రితేష్. అలా అతనికి మంజూరీ పేరుతో ఓ కంపెనీ పెట్టాలన్న ఆలోచన వచ్చింది. గోవాకి చెందిన రితేష్ తన స్నేహితుడితో కలిసి ఈ కంపెనీని 2019లో స్టార్ట్ చేసాడు. ఆ సమయంలో ఇలాంటి కంపెనీ మరొకటి ఉందా అని రీసెర్చ్ చేస్తుండగా అలాంటిది ఏమీ లేదని తెలిసింది. దాంతో తానే ట్రెండ్ సెట్ చేయాలనుకున్నాడు. ఇప్పుడు కంపెనీలో తన వాటా రూ.12 కోట్లు.
ఇంతకీ ఈ కంపెనీ ద్వారా అతను ఏం చేస్తున్నాడు? అని అనుకుంటున్నారా? ఆడవాళ్ల కోసం సెక్స్ టాయ్స్ అమ్ముతుంటాడు. కొంతమంది ఆడవాళ్లు మరో భాగస్వామితో లైంగికంగా కలిసేందుకు ఇష్టపడరు. అలాంటివారి లైంగిక కోరికలు తీర్చేందుకే ఈ మంజూరీ సంస్థను ఏర్పాటుచేసారు. ఆడవారికి భావప్రాప్తిని కలిగించే అన్ని రకాల సెక్స్ టాయ్స్‌ని మంజూరీ సంస్థలో అమ్ముతున్నారు. అయితే భారత ప్రభుత్వం ఇలాంటి కంపెనీలకు అనుమతి ఇవ్వదు. అందుకే సెక్స్ టాయ్స్ సప్లయర్ అని కాకుండా వెల్నెస్ స్టార్టప్ పేరుతో తన సంస్థను రిజిస్టర్ చేయించుకున్నాడు.