Ayodhya Airport: ఆలయాన్ని తలపించే అయోధ్య ఎయిర్పోర్ట్ గురించి ఈ విషయలు తెలుసా?
Ayodhya Airport: ఉత్తర్‌ప్రదేశ్‌లో (uttar pradesh) రెండు ప్రసిద్ధ కట్టడాలు త్వరలో అందుబాటులోకి రానున్నాయి. ఒకటి అయోధ్య రామ మందిరం, రెండోది అయోధ్య ఎయిర్పోర్ట్. ఈ రెండింటిలో ఏది ఆలయంలో ఏది ఎయిర్పోర్టో చెప్పడం కాస్త కష్టమే. ఎందుకుంటే రెండు కట్టడాలు ఆలయాన్ని తలపించేలాగే ఉంటాయి.
ఈ ఆలయాన్ని రూ.250 కోట్లతో నిర్మిస్తున్నారు. నగారా (nagara) చారిత్రాత్మక కట్టడాలను పోలి ఉండేలా ఈ ఎయిర్‌పోర్ట్‌ను డిజైన్ చేసారు. రామాయణానికి చెందిన కళలను, రూపాలను ఈ ఎయిర్‌పోర్ట్‌లో రూపొందించారు. ఎయిర్పోర్ట్ ప్రవేశ ద్వారం శిఖరంలా కనిపిస్తుంది. ఈ ఎయిర్‌పోర్ట్‌కు మర్యాద పురుషోత్తం శ్రీరామ్ అంతర్జాతీయ విమానాశ్రయం అని పేరు పెట్టారు. ప్రతి గంటకు నాలుగు విమానాలు ప్రయాణించేలా 750 మంది ప్రయాణికులు కూర్చునే సామర్ధ్యం ఉండేలా రూపొందించారు. 178 ఎకరాల్లో ఉన్న ఎయిర్ స్ట్రిప్‌లో ఈ ఎయిర్పోర్ట్ కడుతున్నారు.