Viral News: తల్లులు తప్పక చూడాల్సిన వీడియో
Viral News: ఈ మధ్యకాలంలో కొందరు ఫోన్లకు ఎలా అతుక్కుపోతున్నారంటే.. ఈ వీడియో చూస్తే తెలుస్తుంది. ఓ తల్లి ఫోన్‌లో పడి తన బిడ్డను పట్టించుకోకుండా కూర్చుంది. హాల్‌లో ఆ పసికందు తన పాటికి తానేదో ఆడుకుంటుంటే.. ఆ తల్లి ఫోన్‌లో మాట్లాడుకుంటూనే కూరగాయలు కట్ చేసింది. ఆ తర్వాత మర్చిపోయి కూరగాయలను ఫ్రిజ్‌లో పెట్టబోయి పిల్లాడిని పెట్టేసింది. ఆ తర్వాత తన భర్త ఇంటికి వచ్చేవరకు ఫోన్‌లో మాట్లాడుతూనే ఉంది.
తీరా ఆమె భర్త ఇంటికి వచ్చాక ఐదు నిమిషాలకు బాబు కనిపించడంలేదని రియలైజ్ అయ్యాడు. బాబు ఎక్కడ అని భార్యను అడిగితే ఇక్కడే ఆడుకుంటూ ఉండాలి అని చెప్పింది. అలా ఇద్దరూ కంగారుగా వెతుకుతుండగా.. ఫ్రిజ్‌లో నుంచి పిల్లాడి అరుపులు వినిపించడంతో ఫ్రిజ్ తెరిచి చూడగా పిల్లాడు అందులో ఉన్నాడు. వెంటనే పిల్లాడిని బయటకు తీసి బుజ్జగించారు. ఈ వీడియో ట్విటర్‌లో పోస్ట్ చేయడంతో 3 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. అయితే ఇది పొరపాటుగా జరిగింది కాదని క్లియర్‌గా తెలుస్తోంది. ఇలాంటి వారి గురించి అవగాహన కల్పించేందుకే ఇలా వీడియో చేసి రిలీజ్ చేసినట్లున్నారు.