Bride Market: ఇక్కడ తండ్రులే కూతుళ్లను అమ్మేసుకుంటారు
కూతురికి పెళ్లి చేయాలని కన్నతండ్రి ఎంత ఉవ్విళ్లూరుతుంటారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు (bride market). ప్రాణానికి ప్రాణంగా ఎంతో గారాబంగా పెంచుకున్న బిడ్డను ఓ అయ్య చేతిలో పెట్టాలని వారు సరిగ్గా చూసుకోకపోయినా తన బిడ్డకు అండగా ఉండాలని అనుకుంటారు. కానీ ఓ ప్రదేశంలో మాత్రం ఆడపిల్లల్ని అందులోనూ కన్నె పిల్లల్ని కన్న తండ్రులే మరో వ్యక్తికి మార్కెట్‌లో వస్తువులను అమ్మినట్లు అమ్మేసుకుంటారు. ఇలా ఆడపిల్లల్ని అమ్ముకునే దానిని కూడా ఏటా పండుగా జరుపుకుంటారు. అసలు ఏంటీ పండుగ? ఎక్కడ జరుగుతోంది ఇలా..?
ఈ బ్రైడ్ మార్కెట్ అనే పండుగను బల్గేరియాలోని స్టారా జగోరా అనే ప్రాంతంలో నిర్వహిస్తారు. నెలలో వచ్చే మొదటి శనివారం ఈ బ్రైడ్ మార్కెట్ ఏదో కూరగాయల సంతలా ఏర్పాటుచేస్తారు. ఈ ప్రదేశంలో డేటింగ్‌లకు ఒప్పుకోరు. అబ్బాయికి నచ్చితే అమ్మాయికి నచ్చకపోయినా చేసుకోవాల్సిందే. ఈ మార్కెట్‌లో 16 నుంచి 20 సంవత్సరాల వయసున్న ఆడపిల్లలను ప్రదర్శనకు ఉంచుతారు. వీరంతా కూడా కన్యలుగానే ఉండాలి. ఒకవేళ అమ్మాయి నచ్చితే ఆ అమ్మాయి తండ్రి చెప్పినంత డబ్బు ఇచ్చి కొనుక్కోవాలి. కూరగాయలు కొనేటప్పుడు ఎలా బేరం ఆడతామో ఇక్కడ కూడా అలాగే బేరాలు ఉంటాయి. (bride market)
ఇది మనకు వినడానికి వింతగా వివాదాస్పదంగా ఉన్నప్పటికీ బల్గేరియాలోని కడైచీ ప్రజలకు ఇది ఒక ఆనవాయిదా వస్తోంది. ఈ బ్రైడ్ మార్కెట్ అనేది వారి సంప్రదాయానికి ప్రతీక. అయితే చాలా అరుదుగా ఈ వర్గానికి చెందిన ఆడపిల్లలు చదువుకుని తమకు కావాల్సిన వారినే ఎంచుకుంటారట. అది కూడా ఎంతో కష్టపడి కుటుంబాన్ని ఒప్పించాల్సి ఉంటుంది. ఈ వర్గానికి చెందిన ఆడవాళ్లు అస్సలు చదువుకోరు. వీరు పెళ్లి చేసుకున్నాక పిల్లల్ని కని ఏదో ఒక పనిచేసి డబ్బు సంపాదించుకుని తమ కూతుళ్లకు 18 ఏళ్లు వచ్చాక మళ్లీ ఇదే మార్కెట్‌లో తాము సంపాదించినదంతా కట్నంగా ఇవ్వడానికి దాచుకుంటారు. అలాగని విడాకులు వంటివి ఉండవా అంటే ఉంటాయ్. కలహాల వల్లో లేదా ఇతర కారణాల వల్లో విడిపోయి మళ్లీ వేరొకరికి కట్నం ఇచ్చి పెళ్లిళ్లు చేసుకుంటారు. (bride market)