Israel Gaza War: కుటుంబాన్ని కోల్పోయి.. వెంటనే విధుల్లోకి జర్నలిస్ట్
Israel Gaza War: గాజాలోని ప్రముఖ మీడియా సంస్థ అల్ జజీరాలో (al jazeera) పనిచేస్తున్న ఓ జర్నలిస్ట్ ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో తన కుటుంబాన్ని పోగొట్టుకున్నాడు. వారి అంత్యక్రియలు నిర్వహించిన మరుసటి రోజే గుండె నిండా బాధతో మళ్లీ విధుల్లో చేరాడు. అల్ జజీరాలో బ్యూరో చీఫ్‌గా పనిచేస్తున్న వైల్ దదో అనే వ్యక్తి గాజాలోని నుసీరత్ క్యాంప్‌లో తలదాచుకున్న తన భార్య, కొడుకు, మనవడిని కోల్పోయాడు. నుసీరత్ క్యాంప్ సురక్షితమైనదని అందుకే వారిని అందులో ఉంచానని తెలిపారు. తీరా చూస్తే ఇజ్రాయెల్ చేసిన మెరుపు దాడుల్లో నుసీరత్ క్యాంప్ శిథిలమైపోయింది. వైల్ దదో కుటుంబం మొత్తం అక్కడికక్కడే చనిపోయింది.
నిన్న చనిపోయిన వారికి అంత్యక్రియలు నిర్వహించి తన ప్రెస్ గేర్ చేతబట్టుకుని తాను నివసిస్తున్న బిల్డింగ్ టాప్ ఫ్లోర్‌కి వెళ్లి లైవ్ వీడియోలో మాట్లాడారు. తన కుటుంబాన్ని కోల్పోయిన బాధ ఎప్పటికీ తీరదని.. అలాగని ప్రజలకు గాజాలో ఏం జరుగుతోందో తెలియాల్సిన అవసరం ఉందని తెలిపారు. అందుకే వెంటనే విధుల్లో చేరానని అన్నారు. (israel gaza war)