Airtel: రూ 9కే అన్‌లిమిటెడ్ డేటా..ఎయిర్‌టెల్ స్పెష‌ల్ ఆఫ‌ర్

Airtel offers unlimited data for 9 rupees

Airtel: ప్ర‌ముఖ టెలికాం కంపెనీ ఎయిర్‌టెల్ అదిరిపోయే ఆఫ‌ర్‌ను లాంచ్ చేసింది. కేవ‌లం రూ.9కే అన్‌లిమిటెడ్ డేటాను ఇస్తోంది. అయితే ఇక్క‌డ ఓ ష‌ర‌తు ఉంది. రూ.9కే అన్‌లిమిటెడ్ డేటా ఇచ్చిన‌ప్ప‌టికీ కేవ‌లం గంట మాత్ర‌మే ప‌నిచేస్తుంది. ఆ గంట సేపు మీరు ఎంత జీబీ అయినా వాడేసుకోవ‌చ్చు.  ఈ డేటా కూడా గంట‌కు 10GB ఇస్తుంది. గంట‌లోపు 10GB దాటేస్తే మాత్రం అది 64Kbps కి ప‌డిపోతుంది. ఈ ఆఫ‌ర్‌ను ఎయిర్‌టెల్ థ్యాంక్స్ యాప్ ద్వారా వినియోగించుకోవ‌చ్చు. మీరు రీచార్జ్ చేసుకున్న మ‌రుక్ష‌ణం నుంచే 60 నిమిషాల కౌంట్‌డౌన్ మొద‌ల‌వుతుంది.