వేరే దేశానికి వెళ్లి మ‌రీ సారి చెప్పిన ఓన‌ర్..!

Japan: ఓ య‌జ‌మాని వేరే దేశానికి(japan) వెళ్లి మ‌రీ ప్యాసెంజ‌ర్ల‌కు సారీ చెప్పారు. ఎందుకంటే.. ఆ య‌జ‌మానికి చెందిన ఎయిర్‌లైన్స్‌లో ప్ర‌యాణించాల్సిన‌వారు 16 గంట‌ల పాటు వెయిట్ చేయాల్సి వ‌చ్చింది. వాళ్లు ఇబ్బందిప‌డ‌టంతో స్వ‌యంగా వెళ్లి క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌నుకున్నారు. అయినా ప్ర‌యాణికులు ఆయ‌న సారీకి క‌రిగిపోలేదు. అస‌లేం జ‌రిగిందంటే.. తైవాన్‌కు(taiwan) చెందిన స్టార్ ల‌క్స్ ఎయిర్‌లైన్స్(star lux airlines) మే 7న వేరే దేశానికి బ‌య‌లుదేరాల్సి ఉంది. కానీ ప్ర‌యాణికులు ఎయిర్‌పోర్ట్‌కు చేరుకోగానే.. ఫ్లైట్ డిలే అయిన‌ట్లు ప్ర‌క‌టించారు. ఇందుకు కార‌ణం వాతావ‌రణంలో మార్పుల‌ని చెప్పారు. దాంతో వేరే రూట్‌లో వెళ్లే విమానం ఎక్కించేందుకు చర్య‌లు తీసుకోవ‌డంలో క్యాబిన్ క్రూ డిలే చేసింది. దాంతో దాదాపు గంట త‌ర్వాత వేరే విమానంలో ఎక్కించాల్సి వ‌చ్చింది. కాసేప‌టికి వేరే విమానంలో ఉన్న ప్ర‌యాణికుల‌ను కూడా ఇదే విమానంలో ఎక్కిస్తామ‌ని చెప్పారు.

తీరా ఎక్కాక‌.. ఫ్లైట్ ల్యాండ్ అవ్వాల్సిన ఎయిర్‌పోర్ట్‌లో ఏదో ధ‌ర్నా జ‌రుగుతోంద‌ట‌. దాంతో మ‌ళ్లీ విమానాన్ని ఆపేసారు. అంత‌టితో ఆగ‌కుండా.. స్లీపింగ్ బ్యాగ్స్ వ‌చ్చే వ‌ర‌కు ప్ర‌యాణికులు ఫ్లైట్ దిగ‌కూడ‌ద‌ని సిబ్బంది క‌మాండ్ చేసారు. ఇక స్లీపింగ్ బ్యాగ్స్ వ‌చ్చాక వారిని టెర్మిన‌ల్‌లోనే ప‌డుకోమ‌ని చెప్పి కేవ‌లం డిన్న‌ర్ ఏర్పాటుచేసారు. ఉద‌యం బ్రేక్‌ఫాస్ట్ మాత్రం వారే కొనుక్కోవాల‌ని చెప్పారు. అలా దాదాపు 16 గంట‌లు గ‌డిచిపోయింది. అప్ప‌టికే కోపంతో రగిలిపోతున్న ప్యాసెంజ‌ర్ల‌కు సారీ చెప్ప‌డానికి స్టార్‌ల‌క్స్ ఎయిర్‌లైన్స్ అధినేత చాంగ్.. జ‌పాన్‌కు వెళ్లారు. ఆయ‌న స్వ‌యంగా వెళ్లి సారీ చెప్పి డ‌బ్బు రీఫండ్ చేస్తామ‌ని చెప్పినా వారు విన‌లేదు. దాంతో ఈ ఘ‌ట‌న కాస్తా సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.