Kolkata Doctor Rape: నిందితుడికి నాలుగు పెళ్లిళ్లు

accused sanjay roy allegedly married 4 times

Kolkata Doctor Rape: క‌ల‌క‌త్తా వైద్యురాలి హ‌త్యాచార ఘ‌ట‌న‌లో ప్ర‌ధాన నిందితుడైన సంజ‌య్ రాయ్ ఒక‌టి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు పెళ్లిళ్లు చేసుకున్నాడ‌ట‌. ముగ్గురు భార్య‌లు సంజ‌య్ రాయ్ రాక్ష‌స ప్ర‌వ‌ర్త‌న భ‌రించ‌లేక వ‌దిలేసి వెళ్లిపోయారు. ఇక నాలుగో భార్య క్యాన్స‌ర్‌తో గ‌తేడాది చ‌నిపోయింది. ఈ నేప‌థ్యంలో సంజ‌య్ రాయ్‌కు పిల్ల‌నిచ్చి పెళ్లి చేసిన ఓ మ‌హిళ త‌న బిడ్డ‌ను సంజ‌య్ చిత్ర‌హింస‌ల‌కు గురిచేసాడ‌ని.. వాడిని వెంట‌నే ఉరితీయ‌కుండా ఇంకా విచార‌ణ‌లు ఎందుక‌ని మీడియాతో అన్నారు.

ఇలా ఏకంగా నాలుగు పెళ్లిళ్లు చేసుకున్న సంజ‌య్ మ‌రో గ‌ర్ల్‌ఫ్రెండ్‌ని కూడా మెయింటైన్ చేసాడు. క‌ల‌క‌త్తా వైద్యురాలిపై హ‌త్యాచారం చేయ‌డానికి ముందు సంజ‌య్ త‌న ప్రేయ‌సికి ఫోన్ చేసి నగ్న చిత్రాలు పంపాల‌ని అడిగాడు. ఆ అమ్మాయి సంజ‌య్‌ని న‌మ్మి పంపింది కూడా. అంతేకాదు.. హ‌త్యోదంతానికి ముందు రోడ్డుపై వెళ్తున్న ఓ అమ్మాయిని కూడా సంజ‌య్ వేధించాడు. ఇంత‌టి రాక్ష‌స బుద్ధి ఉన్న సంజ‌య్‌ని ఇప్ప‌టికీ విచార‌ణ పేరుతో కోర్టుల చుట్టూ ఎందుకు తిప్పుతున్నారో అర్థంకావ‌డంలేదు. ఓ ఆడ‌పిల్ల‌ని దారుణంగా రేప్ చేసి చంపేసానే అన్న బాధ కానీ ప‌శ్చాత్తాపం కానీ సంజ‌య్‌లో ఇసుమంతైనా క‌నిపించ‌లేద‌ని CBI అధికారులే చెప్తున్నారు. ఇలాంటి వ్య‌క్తిని ఇంకా ఎందుకు బ‌తికే ఉంచారో త‌మ‌కైతే అర్థంకావ‌డంలేద‌ని మృతురాలి తల్లిదండ్రులు, స్నేహితులు వాపోతున్నారు.