Rape కేసులో అరెస్ట్.. విడుదలై వచ్చి మళ్లీ రేప్
కుక్క తోక వంకర అంటే ఇదేనేమో. అత్యాచార కేసులో (rape) అరెస్ట్ అయ్యి నిందితుడు బెయిల్‌పై బయటికి వచ్చి మళ్లీ ఓ చిన్నారిని దారుణంగా రేప్ చేసాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో జరిగింది. సత్నా జిల్లాకు చెందిన 35 ఏళ్ల రాకేష్ వర్మ 12 ఏళ్ల క్రితం ఓ నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అప్పట్లో అతనికి న్యాయస్థానం పదేళ్లు జైలు శిక్ష విధించింది. ఏడేళ్లు జైలు శిక్షను అనుభవించాక రాకేష్‌ను సత్ప్రవర్తన కింద మూడేళ్ల శిక్ష తగ్గించి ఇటీవల రిలీజ్ చేసారు. (rape)
ఇప్పుడు అదే సత్నా జిల్లాకు చెందిన మరో మైనర్ బాలికపై అత్యాచారం చేసాడు. బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుడు రాకేష్ అని తెలిసి వాళ్లు కూడా షాకయ్యారు. ఏడేళ్లు జైలు శిక్ష అనుభవించాక కూడా అతని బుద్ధి మారలేదు. దాంతో అతన్ని అదుపులోకి తీసుకుని పూర్తి స్థాయిలో విచారణ చేపడతామని తెలిపారు. ఇలాంటి వ్యక్తికి యావజ్జీవ కారాగార శిక్ష వేస్తే తప్ప బుద్ధి రాదు అంటూ బాధితురాలి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.