Survey: త‌క్కువ జీతాలు.. వ‌ర్క్ ఫ్రం హోం చాల‌ట‌!

Hyderabad: మంచి జీతం, మంచి లైఫ్‌స్టైల్‌ను కోరుకోని వారు ఉండ‌రు. కానీ ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో మంచి లైఫ్‌స్టైల్ కావాలంటే మంచి జీతం ఉండ‌న‌క్క‌ర్లేదు అని క్లియ‌ర్‌గా తెలుస్తోంది. ఎందుకంటే.. మంచి జీతం ఇచ్చే కంపెనీలు వ‌ర్క్ విష‌యంలో టార్చ‌ర్ కూడా అంతే రేంజ్‌లో పెడుతుంటాయి. అదే త‌క్కువ జీతం ఉన్నా స‌రే.. ప్ర‌శాంత‌మైన ప‌ని ఉంటే చాలు అని అనుకుంటున్నారు ఇక్క‌డి ఉద్యోగులు. ప్ర‌ముఖ జాబ్ సైట్ ఇన్‌డీడ్ చేప‌ట్టిన స‌ర్వేలో (survey) ఈ విష‌యాలు వెల్ల‌డ‌య్యాయి. ఉద్యోగాల కోసం ప్ర‌య‌త్నిస్తున్న 1200 మందితో ఇన్‌డీడ్ ఈ స‌ర్వే చేప‌ట్టింది.

త‌క్కువ జీతాలు ఇచ్చినా ఓకే

1200 మందిలో 67% మంది జీతం, కంపెనీ ఇచ్చే బెనిఫిట్ల గురించి పెద్దగా ఆస‌క్తి చూప‌లేద‌ట‌. ఇందుకు కార‌ణం కంపెనీ అన్ని బెనిఫిట్లు మంచి జీతం ఇస్తోందంటే.. ఇక ఫ్యామిలీకి దూరం అయిపోతాం అన్న భ‌య‌మే. త‌క్కువ జీతం వ‌చ్చినా ఫ‌ర్వాలేదు కుటుంబంతో గ‌డిపే స‌మ‌యం దొరికితే చాలు అనుకుంటున్నారు. (survey)

5 రోజులు ఆఫీస్‌కి రావాలంటే కుద‌ర‌దు

కోవిడ్ వ‌ల్ల వ‌ర్క్ ఫ్రం హోం మోడ‌ల్ స్టార్ట్ అయింది. దాంతో హాయిగా ఇంట్లో నుంచే ప‌ని చేసుకునే సౌక‌ర్యం క‌లిగింది. అటు డ‌బ్బు ఆదా అయింది.. ఇటు కుటుంబంతో క‌లిసి గ‌డిపే స‌మయం దొరికింది. కానీ ఇప్పుడు చాలా కంపెనీలు వ‌ర్క్ ఫ్రం హోం ఆప్షన్ తీసేస్తున్నాయి. కొన్ని హైబ్రిడ్ మోడ‌ల్‌లో పనిచేస్తుంటే మ‌రికొన్ని పూర్తిగా ఆఫీస్‌కి రావాల‌ని డిమాండ్ చేస్తున్నాయి. అయితే 1200 మంది ఉద్యోగుల్లో 70% మంది అయితే వ‌ర్క్ ఫ్రం హోం లేదా హైబ్రిడ్ మోడ‌ల్ ఉద్యోగాలు ఉంటేనే చేస్తాం అని అంటున్నారు. (survey)

రిమోట్ జాబ్స్ బెస్ట్

గ‌తంలో చాలా మంది ఉద్యోగులు ల‌క్ష‌ల్లో ప్యాకేజీల‌ను వ‌దిలేసుకుని త‌క్కువ జీతాలున్నా కూడా రిమోట్ జాబ్స్ చూసుకోవ‌డానికి కూడా వెనుకాడ‌లేదు. వారిలో ప్ర‌ముఖ టెక్ సంస్థ యాపిల్‌లో మెషీన్ లెర్నింగ్ డైరెక్ట‌ర్‌గా పనిచేసిన ఇయాన్ అనే వ్య‌క్తి ఒక‌రు. ఎప్పుడైతే ఇయాన్‌ను సంస్థ ఆఫీస్ నుంచి వ‌ర్క్ చేయాల‌ని చెప్పిందో ఆయ‌న వెంటనే ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి రిమోట్ జాబ్ చూసుకున్నారు. (survey)