Himachal Rains: చనిపోయినా బాగుండు.. మహిళ ఆవేదన
హిమాచల్ ప్రదేశ్‌ని వర్షాలు (himachal rains) కుదిపేసాయి. వర్షాలు వరదల కారణంగా కొండచరియలు విరిగి పడి ఇటీవల వరుసగా నాలుగైదు బిల్డింగులు కూలిపోయాయి. ఈ ఘటనలో సర్వం కోల్పోయిన ఓ మహిళ మీడియా వర్గాలతో మాట్లాడుతూ.. వాటితో పాటు నేనూ చనిపోయినా బాగుండు అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ప్రారీ ప్రదేశంలో వయసైపోయిన తన తల్లితో కలిసి నివసిస్తున్న ప్రోమిలా అనే యువతి ఇల్లు వర్షాలకు కూలిపోయింది. దాంతో వారిద్దరికీ తలదాచుకోవడానికి స్థానం లేదు. దాంతో ఆమె బాధను మీడియాతో పంచుకుంది.
“” నేను నా 75 ఏళ్ల తల్లితో కలిసి ఇక్కడ ఉంటున్నాను. మా అమ్మ 2016 నుంచి క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకుంటోంది. రామ్ నగర్‌లోని ఓ సిటీ మార్కెట్లో నేను సేల్స్ గర్ల్‌గా ఉద్యోగం చేస్తుండేదాన్ని. ఇప్పుడు ఆ ఉద్యోగం కూడా పోయింది. నాకు తండ్రి లేడు. నా భర్త నన్ను వదిలేసాడు. నాకున్నదల్లా మా అమ్మే. ఇల్లు కూలిపోవడంతో ఎక్కడికి వెళ్లాలో తెలీక దగ్గర్లోని ప్రభుత్వ హాస్పిటల్లో పడుకున్నాను. ఇంట్లో ఉన్న ఏ ఒక్క సామాను కూడా మిగల్లేదు. ఇల్లు కూలిపోతుంటే కట్టు బట్టలతో బయటికి పరిగెత్తుకుంటూ వచ్చేసాం అంటూ కన్నీరుమున్నీరయ్యారు “” ప్రోమిలా. (himachal rains)