Viral News: ప్రియుడితో ట్రిప్‌కి వెళ్లి.. మరొకరిని ప్రేమించి పెళ్లి..!
Viral News: ఓ యువతి ప్రియుడితో హాలిడే ట్రిప్‌కి వెళ్లి.. అక్కడ మరో వ్యక్తితో ప్రేమలో పడి ఏకంగా అతన్ని పెళ్లి చేసేసుకుంది. ఈ ఘటన అమెరికాలో చోటుచేసుకుంది. కారా అనే అమెరికా యువతి తన ప్రియుడితో కలిసి ఫ్లోరిడాకు ట్రిప్‌కి వెళ్లింది. అక్కడ జేమ్స్ అనే బ్రిటిష్ వ్యక్తితో పరిచయం ఏర్పడంతో అతనితో ప్రేమలో పడింది. అంతే కాదు జేమ్స్ కోసం తన ప్రియుడిని వదిలేసి అతని కోసం కెనడా వరకు వెళ్లిపోయింది. చివరికి అతన్నే పెళ్లి చేసుకుంది. జేమ్స్‌ని చూడగానే ముందు అతని కళ్లు, నవ్వు చాలా నచ్చాయని.. తమ మధ్య ఏదో జరగబోతోందని తనకు అప్పుడే అర్థమైందని కారా వెల్లడించింది.